Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో డ్రగ్ స్మగ్లర్ అరెస్ట్.. ఫోన్ లో 8వేల మంది ప్రముఖుల పేర్లు!
By: Tupaki Desk | 4 Jan 2023 6:37 AM GMTహైదరాబాద్ లో మరో సారి డ్రగ్స్ మూలాలు బయటపడ్డాయి. భారీ డ్రగ్ స్మగ్లర్లు పట్టుబడ్డారు. మత్తు మాఫియా కింగ్ ల ఫోన్లలో ప్రముఖుల చిట్టాలు బయటపడుతున్నాయి. తాజాగా డ్రగ్స్ మాఫియా ప్రధాన సూత్రధారులను పట్టుకున్న హైదరాబాద్ పోలీసులు ఈ డ్రగ్స్ పెడ్లర్లు, స్మగ్లర్లతో కొందరు ప్రముఖులకు సంబంధం ఉందని ప్రాథమికంగా గుర్తించడం సంచలనమైంది.
హైదరాబాద్ లో డ్రగ్స్ ప్రధాన సూత్రధారులను అరెస్ట్ చేసిన పోలీసులు కీలక సమాచారం రాబట్టారు. మరిన్ని వివరాలు సేకరించాక నోటీసులు జారీ చేయాలని చూస్తున్నారు. గోవా కేంద్రంగా జాతీయ, అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలున్న కీలక సూత్రధారులు 18 మందిని గుర్తించారు. వీరిలో ప్రతీష్ నారాయణ్ బోర్కర్, జాన్ స్టీఫెన్ డిసౌజా, తుకారాం, ఎడ్విన్ న్యూన్స్, బాలమురుగన్, హేమంత్ అగర్వాల్, వికాస్ నాయక్, సంజ గోవెకర్, రమేష్ చౌహాన్ వంటి డ్రగ్ కింగ్ పిన్ లను అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
ఇక ఈ అరెస్ట్ అయిన వారి ఫోన్లు చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది పోలీసులకు. ఎందుకంటే సుమారు 8 వేల మంది డ్రగ్స్ వినియోగిస్తున్న వారి వివరాలు ఉన్నాయి. ఇందులో కొందరు ప్రముఖుల పేర్లు కూడా ఉండడం చూసి షాక్ అయ్యారు. విచారణ జరిపి ఆధారాలు సేకరించి దాదాపు 400 మందికి 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు.
గోవా డ్రగ్ కింగ్ పిన్ ఎడ్విన్ నుంచి హైదరాబాద్ లో అరెస్ట్ అయిన డీజే మోహిత్ అగర్వాల్ వరకూ ఎక్కువమంది పబ్ లు, హోటళ్లలో సర్వర్లుగానే కెరీర్ ప్రారంభించి ఏకంగా డ్రగ్ స్మగ్లర్లుగా ఎదగడం విశేషం. మత్తుపదార్థాల దందాలో బాగా ఎదిగారు. మాఫియాతో సంబంధాలు పెంచుకొని మత్తు సామ్రాజ్యాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఖరీదైన భవనాల్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని పోలీసులు తేల్చారు. డ్రగ్స్ దందాతో వీరు బాగా దోచుకున్నారని సమాచారం. కోట్లాది రూపాయాల ఆస్తిపాస్తులున్నట్టు తేలింది.
ఈ డ్రగ్ మాఫియా ఫైనాన్స్ చేసే స్తాయికి ఎదిగిందని.. తమిళనాడు కు చెందిన బాలమురుగన్ కీలక వ్యక్తిగా తేల్చారు. హిమాచల్ ప్రదేశ్ కేంద్రంగా రాజస్థాన్, మహారాస్ట్ర, హైదరాబాద్ పర్యాటక ప్రాంతాలు, హోటల్స్, పబ్ లకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు గుర్తించారు.
హైదరాబాద్ లో పట్టుబడిన మోహిత్ సర్వర్ నుంచి డ్రగ్ డాన్ గా ఎదిగాడు. బాలీవుడ్ నటి నేహా దేశ్ పాండేను ప్రేమించి పెళ్లి చేసుకోవడం విశేషం. ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ స్థాపించి డీజేలను దేశానికి రప్పించి ఆ ముసుగులో వేడుకల్లో ఈ డ్రగ్స్ దందా చేస్తున్నట్టు తేలింది. ప్రస్తుతం ఇతడితో అంటకాగిన కొంతమందికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు రెడీ అయినట్టు సమాచారం. ఇందులో కొందరు బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. వారికి పోలీసులు నోటీసులు ఇచ్చి విచారించేందుకు పోలీసులు రెడీ అయ్యారు