Begin typing your search above and press return to search.
సీఎం మనమడితో కార్పొరేటర్ కాకా..!
By: Tupaki Desk | 7 July 2018 6:07 AM GMTరంగం ఏదైనా పట్టుపరిశ్రమ అంతా ఉన్నదే. సినిమా..రాజకీయ రంగాల్లో మరికాస్త ఎక్కువ. అయితే.. కాకా పట్టటంలో పరాకాష్ఠ లాంటి ఉదంతం ఒకటి తాజాగా బయటకు వచ్చి సంచలనంగా మారింది. కాకాలకు కాకా అన్నట్లుగా హైదరాబాద్ నగరానికి చెందిన ఒక కార్పొరేటర్ చేసిన ప్రయత్నం సీఎంవో సైతం చిరాకు పడటమే కాదు.. ఇదేమాత్రం మంచి పద్దతి కాదని హెచ్చరించాల్సి వచ్చింది. ఇంతకీ జరిగిందేమంటే..
రానున్నదంతా ఎన్నికల సీజన్ కావటంతో.. ఏదోలా ఎమ్మెల్యే కావాలన్నది ఒక కార్పొరేటర్ ఆశ. కార్పొరేషన్ స్థాయి నుంచి ఎమ్మెల్యేగిరి కావాలన్నది ఆయన ఆశ. అందుకోసం తనకు చేతనైనన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. అక్కడితో ఆగని ఆయన మూడు తరాలు ముందుకు ఆలోచించాడు. మామూలుగా ఉండే పట్టుపరిశ్రమకు కొత్త అర్థం చెప్పేలా భారీ ఐడియా ఒకటి కార్పొరేటర్ మనసులో వచ్చేసింది.
అందరిని కలిసి.. ఎమ్మెల్యే టికెట్ కోసం చేసే ప్రయత్నాలకు మరో అదనపు హంగు చేర్చాలనుకున్నాడు. అంతే.. ముఖ్యనేత వంశంలో మూడోతరం వాడు.. తనకన్నా వయసులో చిన్నవాడు అయిన ఆయన మనమడ్ని పట్టుకుంటే బాగుంటుంది కదా? అన్న ఆలోచన చేశాడు. పరిచయం కాస్త పెరిగితే.. తాతతో చెప్పి టికెట్ ఇప్పించకుండా ఉంటాడా? అన్న ఆలోచన చేశాడు.
అంతే.. ఆ బుల్లిరాజా వారి సోషల్ మీడియా ఖాతాలో అతన్ని పాలో అవుతూ.. పొద్దున లేవగానే.. అన్నా.. నమస్తే బాగున్నారా.. గుడ్ మార్నింగ్ టిఫిన్ చేశారా.. అంటూ మొదలెట్టి మధ్యాహ్నం వేళకు గుడ్ ఆఫర్ట్ నూన్ చెప్పి.. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేశారా? అంటూ మరోసారి పలుకరించి..రాత్రి వేళ డిన్నర్ అయ్యిందా? అన్న వాకబుతో పాటు.. గుడ్ నైట్.. స్వీట్ డ్రీమ్స్ అంటూ నాలుగు పూటలు మెసేజ్ లతో పలుకరించేవాడు.
కార్పొరేటర్ అత్యుత్సాహన్ని సీఎంవో గుర్తించింది. అతగాడి అత్యుత్సాహానికి బ్రేకులు వేయాలన్న ఆలోచనతో అతడికి కబురు పంపింది. ప్రగతి భవన్ నుంచి వచ్చిన పిలుపుతో ఒక్కసారిగా అలెర్ట్ అయిన సదరు కార్పొరేటర్ ఫుట్ హ్యాపీగా ఫీలై..తనతో పాటు మరో పదిమందిని వేసుకొని అక్కడకు వెళ్లారు. అక్కడకువెళ్లాక సిబ్బంది.. ప్రగతి భవన్ కార్యాలయ సిబ్బంది వేసిన ప్రశ్నలకు దిమ్మ తిరిగిపోయింది.సోషల్ మీడియా ద్వారా పలుకరిస్తే బాగోదని.. మర్యాద దక్కదంటూ అరగంట పాటు పీకిన క్లాన్ తో తలవాచిన ఆయన ఇంటిముఖం పట్టారు. ఈ మేసేజ్ ల్ని సోషల్ మీడియాలో సీఎంవో తొలగించినట్లుగా తెలుస్తోంది. ఏమైనా.. కార్పొరేటర్ గారి కాకా వ్యవహారం సీఎంవోలో ఆసక్తికర చర్చకు తావిచ్చినట్లుగా తెలుస్తోంది.