Begin typing your search above and press return to search.
బీఫ్ రగడకు ఫుల్ స్టాప్
By: Tupaki Desk | 7 Dec 2015 3:13 PM GMTప్రపంచ మానవ హక్కుల దినం సందర్భంగా ఈ నెల 10న ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక (డీసీఎఫ్) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించతలపెట్టిన 'బీఫ్ ఫెస్టివల్'పై రాద్ధాంతం ముగిసింది. తమ ఆహారపు అలవాట్లపై ఇతరుల పెత్తనాన్ని సహించబోమని హెచ్చరిస్తు ప్రజాస్వామ్య సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో దళిత - గిరిజన - బహుజన - అభ్యుదయ - మైనార్టీ వర్గాలకు చెందిన సుమారు 26 సంఘాలు 'పెద్దకూర' పండుగ నిర్వహించేందుకు ముందుకు వచ్చాయి. అయితే బీఫ్ ఫెస్టివల్ ను నిర్వహిస్తున్న రోజే పోర్క్ ఫెస్టివల్ ను ఏర్పాటుచేయనున్నట్లు మరో విద్యార్థి సంఘం ప్రకటించింది. ఈ అయితే తమను అడ్డుకునేందుకు హిందుత్వ సంస్థలు కుయుక్తులు పన్నుతున్నాయనే వాదనను పెద్దకూర పండుగ సంఘాలు విమర్శించాయి. ఇలా వాదోపవాదాల మధ్య నలిగిన బీఫ్ ఫెస్టివల్ కు ముగింపు కార్డు పడింది.
బీఫ్ ఫెస్టివల్ జంతు సంరక్షణ చట్టానికి విరుద్దమంటూ జనార్ధన్ అనే న్యాయవాది సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్టు...ఉస్మానియా యూనివర్శిటీలో ఎలాంటి పండుగలు - వేడుకలు నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు ఈ నెల 21 వరకు యధాస్థితిని కొనసాగించాలని కోర్టు స్పష్టం చేసింది.
బీఫ్‌పై ఆంక్షలు వద్దంటూ అభ్యుదయ, సామాజిక విద్యార్థి సంఘాలు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. బీఫ్ ఫెస్టివల్ ను ఆపకపోతే దాద్రి వంటి మరో ఘటన జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించడమే కాకుండా పెద్ద కూర పండుగను అడ్డుకునేందుకు 10న చలో ఉస్మానియా చేపట్టనున్నట్లు కూడా ప్రకటించారు. మొత్తంగా గత నెలరోజులుగా సాగుతున్న రగడకు కోర్టు ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది.