Begin typing your search above and press return to search.
ఒక రోజు జైలుకు పిల్లల పేరెంట్స్..ఎందుకంటే?
By: Tupaki Desk | 2 March 2018 5:10 AM GMTకొత్త తరహా పోలీసింగ్‌కు తెర తీస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఈ మధ్యన ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వెహికిల్స్ నడిపిన వారిపై కేసులు బుక్ చేయటం.. వారికి ఒక రోజు జైలుశిక్ష విధించటంతో సంచలనం సృష్టించిన వైనానికి కొనసాగింపుగా.. మైనర్లకు వాహనాలు ఇచ్చిన పిల్లల తల్లిదండ్రులకు ఒక రోజు జైలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఈ తీరులో శిక్షలు విధించటం గమనార్హం. టూవీలర్ నడిపేందుకు లైసెన్స్ లేకున్నా.. బండి నడిపిన 14 ఏళ్ల పిల్లాడికి ఒకరోజు జైలుతో పాటు.. పిల్లలకు వాహనాలు ఇచ్చే పది మంది పేరెంట్స్ కు జైలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
లైసెన్స్ లేకుండా పిల్లలకు బండ్లు ఇచ్చే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు.. అనంతరం వారిని కోర్టుకు హాజరుపర్చారు. ఈ సందర్భంగా కోర్టు స్పందిస్తూ ఒక రోజు సాధారణ జైలును విధిస్తూ తీర్పును ఇచ్చారు. ఫలక్ నుమా పరిధిలోని పేరెంట్స్ కు ఈ తరహా శిక్ష విధించినట్లుగా చెబుతున్నారు.
ఇటీవల కాలంలో ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిర్లక్ష్యం.. అజాగ్రత్త.. రూల్స్ ను ఫాలోకాకుండా వాహనాలు నడుపుతున్న వారిని ఏ మాత్రం ఉపేక్షించటం లేదు. ప్రమాదానికి కారణమైన ఏ అంశంలోనూ రాజీ లేకుండా కేసులు నమోదు చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపటం ఒక తప్పు అయితే.. మైనర్లు బండ్లు నడపటం ప్రమాదకరం. దీనిపై దృష్టి సారించిన పోలీసులు.. కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విషయంలో కోర్టు సైతం ఒక రోజు జైలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రులూ.. పిల్లలు.. కుర్రాళ్లు.. అందరూ వినండి. వాహనాల నడిపే విషయంలోనూ.. డ్రైవింగ్ చేసే సమయంలో రూల్స్ ను పక్కాగా ఫాలో కండి. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల డేగకన్ను మీ మీద ఉందన్నది మర్చిపోవద్దు. తప్పు చేస్తే అడ్డంగా బుక్ కావటం ఖాయం.