Begin typing your search above and press return to search.
మోడీ భార్యపై హైదరాబాద్ డాక్టర్ దీక్ష!
By: Tupaki Desk | 6 Jan 2018 6:06 AM GMTవిన్నంతనే ఆశ్చర్యపోయే లా పాయింట్ ఒకటి తీసి నిరసన దీక్ష చేస్తోంది హైదరాబాద్‌కు చెందిన మహిళా డాక్టర్. ప్రధాని మోడీ సతీమణి యశోదబెన్ వ్యవహారం తెలిసిందే. చిన్న వయసులోనే పెళ్లి జరిగిన వీరిద్దరూ.. తర్వాతి కాలంలో దూరంగా ఉన్నారు. ఆ మాటకు వస్తే భార్యకు దూరంగా ఉంది మోడీనే. 2014 సార్వత్రిక ఎన్నికల ముందు వరకూ తన పెళ్లి విషయంపై పెదవి విప్పని మోడీ..నామినేషన్ లో మాత్రం తనకు పెళ్లి అయ్యిందని.. భార్యపేరు యశోద బెన్ అంటూ పేర్కొన్నారు.
అప్పటివరకూ మోడీ బ్రహ్మచారిగా ఫీలైన వారు తెగ ఆశ్చర్యపోయారు. దీంతో అప్పటివరకూ కొందరికి మాత్రమే తెలిసిన మోడీ సతీమణి వ్యవహారం అందరికి తెలిసింది. అప్పుడెప్పుడో భర్తకు దూరంగా ఉంటున్న యశోదాబెన్.. ఆ మధ్యన మోడీ ఆహ్వానిస్తే ఆయన ఇంటికి వెళతానని పేర్కొన్నారు. కానీ.. ఈ విషయం మీద మోడీ స్పందించలేదు.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లోని మియాపూర్‌కు చెందిన మహిళా డాక్టర్ పాలెపు సుశీల.. ఆరు రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు.
యశోదబెన్ తో తన పెళ్లి చెల్లదని మోడీ అన్నప్పుడు.. ఆమెకు జెడ్ కేటగిరి భద్రత ఎలా ఇస్తారంటూ ప్రశ్నించిన ఆమె.. యశోదబెన్ కు ఏ హోదాతో జెడ్ కేటగిరి రక్షణ కల్పిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించి సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారం ఇవ్వాలంటూ అప్లికేషన్ అప్లై చేశారు.
జెడ్ కేటగిరి భద్రతతో పాటు.. ప్రధాని భార్య హోదాలో జశోదాబెన్ కు ఇంక ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నార్న విషయాలు వెల్లడించాలని కోరారు. జశోదాబెన్ ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణిస్తుండగా.. ఆమె భద్రతగా ఉన్న సిబ్బంది మాత్రం అధికార వాహనాలు వాడటం విచిత్రంగా ఉందన్నారు. మొత్తంగా కొత్త పాయింట్ ఒకటి తెర మీదకు తీసుకొచ్చి నిరసన దీక్ష చేస్తున్న ఆమె వైనం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.