Begin typing your search above and press return to search.
కలకలంగా మారిన మాజీ ఎయిర్ హోస్టెస్ యవ్వారం
By: Tupaki Desk | 20 Oct 2019 8:47 AM GMTడబ్బు కోసం దేనికైనా రెఢీ అన్నట్లుగా వ్యవహరించే కొందరి తీరు తెలిసిందే. అందచందాల్ని పెట్టుబడిగా చేసుకొని.. ఆ బలహీనతకు లొంగే వారిని తెలివిగా ఉచ్చులో బిగించి.. లక్షలాది రూపాయిలు కొల్లగొట్టే ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షాకింగ్ విషయం ఏమంటే.. ఈ ఇద్దరు భార్యభర్తలు కావటం. హోటల్ బిజినెస్ చేస్తూ నష్టాలకు గురైన భర్త.. ఎయిర్ హోస్టెస్ గా ఉద్యోగం చేసి మానేసిన భార్య ఇద్దరూ కలిసి తెలివిగా హనీ ట్రాప్ వేస్తూ లక్షలాది రూపాయిలు వెనకేసుకుంటున్న వైనాన్ని తాజాగా పోలీసులు గుర్తించారు.
మొయినాబాద్ ప్రాంతంలోని ఒక ప్రార్థన మందిరానికి ఆగస్టులో పాతికేళ్ల మహిళ ఒకరు వచ్చారు. మత ప్రచారకుడితో మాట కలిపారు. తన నివాసం సికింద్రాబాద్ అని పేర్కొన్న ఆమె.. తాను అనాదాశ్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా చెప్పి ఫోన్ నెంబర్ తీసుకుంది. తరచూ వాట్సాప్ చాటింగ్ చేస్తూ రెండుసార్లు వ్యక్తిగతంగా కలిశారు.
అనంతరం వండర్ లాకు తీసుకెళ్లి.. సన్నిహితంగా ఉండే ఫోటోలు తీసుకున్నారు. తన మాయలో మతప్రచారకుడు పూర్తిగా పడిపోయాడని నిర్థారించుకున్న సదరు మహిళ తన అసలు రూపాన్ని బయట పెట్టింది. తన భర్త హోటల్ వ్యాపారం చేస్తారని.. విజయవాడలో ఏర్పాటు చేస్తున్న హోటల్ లో పెట్టుబడులు పెట్టాలని కోరగా.. రూ.10లక్షలు ఇచ్చారు. అనంతరం హోటల్ వ్యాపారాన్ని మాట్లాడేందుకు ప్రతినిధులు వస్తున్నారంటూ శంకర్ పల్లిలోని ఒక రిసార్ట్ కు తీసుకెళ్లింది. రాత్రివేళ అతడితో రొమాన్స్ చేస్తూ మద్యంలో నిద్రమాత్రలు కలిపింది.
సదరు మత ప్రచారకుడు మత్తులో జారుకున్న తర్వాత అతనితో సన్నిహితంగా ఉన్నట్లు ఫోటోలు.. వీడియోలు తీసింది. తర్వాతి రోజు ఉదయం ఆమె భర్త బాధితుడి హోటల్ గదికి వచ్చి తుపాకీతో బెదిరించాడు.దీంతో భయపడిపోయిన అతను తనను ఏమీ చేయొద్దని ప్రాధేయపడ్డాడు. తనకు కోటి రూపాయిలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అగ్రిమెంట్ చేసిన తర్వాతి రోజే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయటంతో రూ.10లక్షలు ఇచ్చారు.
డబ్బు కోసం పెద్ద ఎత్తున వేధింపులు పెరగటంతో బాధితుడు పోలీసులకు కంప్లైంట్ చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి దంపతులు ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. గతంలోనూ ఇదే తీరులో పలువురిని హనీట్రాప్ చేసి బెదిరించి సొమ్ము చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. తమ వ్యవహారం బయటకు వస్తే పరువు పోతుందన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్న విషయం బయటకు వచ్చింది. హనీ ట్రాప్ ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారటమే కాదు.. సంచలనంగా మారింది.