Begin typing your search above and press return to search.
హైదరాబాద్ కారు రేసింగ్ లో తప్పిన పెను ముప్పు!
By: Tupaki Desk | 20 Nov 2022 5:30 AM GMTఇంతకాలం టీవీల్లో మాత్రమే చూసిన ఫార్ములా రేసింగ్ ను కళ్ల ఎదుట చూసే అవకాశం హైదరాబాద్ ప్రజలకు లభించటం తెలిసిందే. ఈ ఖరీదైన స్పోర్ట్ గురించి అప్పుడప్పుడు టీవీల్లో చూడటమే తప్పించి.. ఈ ఆట ఎలా సాగుతుంది? దీని రూల్స్ లాంటివి అస్సలు తెలీదు. చాలామందికి తెలిసిందల్లా రేసులో ఎవరైతే ముందు ఉంటారో వారే విజేత అని. అయితే.. ఈ ఆట ఇది మాత్రమే కాదు. అంతకు మించి చాలానే ఉందని చెబుతారు. ఈ క్రీడలో ఉపయోగించే రేస్ కారు ధరలు రూ.15 కోట్ల నుంచి రూ.25 కోట్లకు పైనే ఉంటాయని చెబుతారు.
ఇంతటి ఖరీదైన ఆటకు కేరాఫ్ అడ్రస్ గా మారింది భాగ్యనగరి. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ కు అనుకొని ఉండే ఎన్టీఆర్ మార్గ్ నుంచి హైమ్యాక్స్ వరకు ఉన్న మూడు కిలోమీటర్లు (సుమారు) దూరంలో ఈ కారు రేసింగ్ ను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం రూ.90 కోట్లు ఖర్చు చేసి ప్రత్యేక ట్రాక్ రోడ్డును నిర్వహించారు కూడా. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ రేసింగ్ లీగ్ తొలి రోజు పోటీ కేవలం ప్రాక్టీస్ మాత్రమే జరగటం తెలిసిందే.
ఈ ప్రాక్టీస్ వేళ అనూహ్య ఘటన ఒకటి చోటు చేసుకోవటం.. త్రుటిలో పెను ప్రమాదం తప్పినట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక చిట్టి వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసినప్పుడు ముంచుకొచ్చిన ప్రమాదాన్ని త్రుటిలో ఎలా మిస్ అయ్యిందన్నది అర్థమవుతుంది. జరిగిందేమంటే.. ప్రాక్టీస్ లో భాగంగా ఒక రేసర్ తన కారులో వేగంగా వెళుతున్న వేళ.. ప్రసాద్ ఐమ్యాక్స్ ఎదురుగా ఉన్న రోడ్డులో చిన్న కొమ్ము కారు మీద పడింది. ఆ వెంటనే కారు కంట్రోల్ తప్పింది.
అయితే.. రేసర్ అప్రమత్తంగా వ్యవహరించటంతో తన కారును ట్రాక్ పక్కన నిలిపేశారు. అయితే.. ఈ ఉదంతంలో కారు కాస్తంత డ్యామేజ్ అయినట్లుగా గెలుస్తోంది. ఆ సమయంలో కారు వేగం గంటకు 230 కి.మీ. వరకు ఉంటుందన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ రేసింగ్ ప్రాక్టీస్ ను జెండా ఊపి ఓపెన్ చేసేందుకు వచ్చిన మంత్రి కేటీఆర్ నిలిచిన వేదిక ఉన్నట్లుండి కాస్త కిందకు కుంగటంతో ఆందోళనకు గురయ్యారు. అయితే.. వేదిక మీదకు ముందుగా అనుకున్న దాని కంటే ఎక్కువ మంది ఉండటం కారణంగా చెబుతున్నారు.