Begin typing your search above and press return to search.
హైదరాబాద్ మళ్లీ డైనమిక్ నగరం..!
By: Tupaki Desk | 21 Jan 2019 9:46 AM GMTవరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో జేఎల్ ఎల్ సిటీ మెమోంటమ్ ఇండెక్స్ ప్రతి ఏడాది మారిగానే ఈ ఏడాది కూడా తన నివేదికను విడుదల చేయడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న జాబితాను ఈ సంస్థ ప్రతి ఏడాది విడుదల చేస్తూ వస్తుంది. 2019 సంవత్సరంకు చెందిన జాబితాను తాజాగా విడుదల చేయడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 131 ప్రముఖ నగరాలను ఈ సర్వేకు తీసుకున్న సదరు సంస్థ అత్యంత డైనమిక్ నగరంగా ఇండియాకు చెందిన బెంగళూరును నిర్ణయించింది. ఆ తర్వాత స్థానంలో హైదరాబాద్ నిలిచింది.
2015వ సంవత్సరంలో ఈ సంస్థ ప్రకటించిన డైనమిక్ నగరాల జాబితాలో హైదరాబాద్ కు స్థానం దక్కలేదు. 2017వ సంవత్సరంలో అయిదవ స్థానంలో, 2018వ సంవత్సరంలో మొదటి స్థానంలో నిలిచింది. అయితే ఈసారి మాత్రం మొదటి స్థానంను బెంగళూరు దక్కించుకుంది. రెండవ స్థానంతోనే హైదరాబాద్ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇండియా నుండి ఇంకా ఢిల్లీ, పుణె, చెన్నై, కోల్‌కత్తా నగరాలు ఉన్నాయి. 4వ స్థానంలో ఢిల్లీ, 5వ స్థానంలో పుణె, 7వ స్థానంలో చెన్నై, 15వ స్థానంలో కోల్ కత్తా లు ఉన్నాయి. జేఎల్ ఎల్ సిటీ మెమోంటమ్ విడుదల చేసిన డైనమిక్ నగరాల టాప్ 20 జాబితాలో ఆసియాకు చెందిన నగరాలే 19 ఉండటం విశేషం.