Begin typing your search above and press return to search.

బ్రేకింగ్: GHMC ఆఫీస్ ఉద్యోగికి పాజిటివ్!

By:  Tupaki Desk   |   8 Jun 2020 9:30 AM GMT
బ్రేకింగ్: GHMC ఆఫీస్ ఉద్యోగికి పాజిటివ్!
X
తెలంగాణలో వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ప్రధానంగా GHMC పరిధిలో ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో నగర ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా GHMC ప్రధాన కార్యాలయంలో వైరస్ కలకలం రేపింది. గ్రేటర్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసీ) ప్రధాన కార్యాలయం ఉద్యోగికి కరోనా వైరస్ సోకినట్లు ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది. హెల్త్ సెక్షన్ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి వైరస్ బారిన పడ్డారు అని, దీంతో అందులో పనిచేస్తున్న ఉద్యోగులు ఆందోళనలకు గురవుతున్నారని ప్రసార మాద్యమాల్లో ప్రచారం జరుగుతుంది. ఇక్కడ దాదాపు 2 వేల మంది పని చేస్తున్నారు.

ఉద్యోగికి పాజిటివ్ ఉందని తేలడంతో..అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే హెల్త్ సెక్షన్ లో రసాయనాలు చల్లుతూ...శానిటైజ్ చేస్తున్నారు. తెలంగాణ సెక్రటేరియట్ కు కూడా కరోనా పాకిందని ప్రసారమాద్యమాల్లో ప్రచారం జరుగుతుంది. ఫైనాన్స్ విభాగంలో పనిచేస్తున్న ఇద్దరికి కరోనా సోకిందనే ప్రచారం జరుగుతోంది. హోమ్ క్వారంటైన్ లో ఉండాలని 30 మంది ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ఉద్యోగులకు సూచించారని, కార్యాలయం నుంచి ఉద్యోగులకు బయటకు పంపారని సమాచారం. వైరస్ ఇంత కలకలం రేపుతున్నా..కార్యాలయం ప్రధాన గేటు వద్ద థర్మల్ స్క్రీనింగ్ కూడా ఏర్పాటు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.