Begin typing your search above and press return to search.
చెన్నై సత్యభామలో తెలుగమ్మాయ్ సూసైడ్
By: Tupaki Desk | 23 Nov 2017 5:14 AM GMTచెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయంలో తెలుగమ్మాయ్ ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్ష రాయనివ్వలేదన్న ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని ఉదంతం సహ విద్యార్థుల్లో సహనం కోల్పోయేలా చేయటమే కాదు.. వర్సిటీలో విధ్వంసం సృష్టించే వరకు వెళ్లింది.
సత్యభామ వర్సిటీలో హైదరాబాద్ కు చెందిన రాధా మౌనిక ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతోన్న రాధా మౌనిక వర్సిటీ సిబ్బంది తనను పరీక్ష రాయకుండా అడ్డుకున్నారన్న అవమాన భారంతో ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆగ్రహం చెందిన విద్యార్థులు వర్సిటీలోని వాహనాలకు.. ఫర్నీచర్ కు నిప్పు పెట్టారు. దీంతో.. అగ్నిమాపక సిబ్బందికి వర్సిటీ వర్గాలు సమాచారం అందించాయి.
మంటల్ని నిలువరించేందుకు వచ్చిన ఫైరింజన్లను లోపలికి వెళ్లకుండా అడ్డుకోవటంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు.. విద్యార్థుల్ని నిలువరించి ఫైరింజన్లు వర్సిటీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు.
తమ సహ విద్యార్థిని ఆత్మహత్యకు వర్సిటీ అధికారులే కారణమని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ మౌనికను పరీక్షలకు ఎందుకు అనుమతించలేదన్న విషయంలోకి వెళితే.. రెండు రోజుల క్రితం జరిగిన పరీక్షలో మౌనిక ఎగ్జామ్ హాల్ లో కాపీ కొట్టిందంటూ అధ్యాపకులు బయటకు పంపేశారు. తదుపరి పరీక్షలకు అనుమతించలేదు. దీంతో.. తీవ్రమైన అవమాన భారానికి గురైంది మౌనిక. మిస్ యూ ఆల్.. లవ్ యూ ఆల్ అన్న మెసేజ్ పెట్టేసిన మౌనిక .. హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొంది.