Begin typing your search above and press return to search.
రేప్ చేసి.. బ్లేడ్ తో కోసి..హైదరాబాద్ లో పైశాచికం?
By: Tupaki Desk | 9 March 2019 5:12 AM GMTవిన్నంతనే మనసంతా వికారంగా మారిపోయి.. ఇదెక్కడి పైశాచికమన్న భావన కలగటం ఖాయం. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన నిర్భయ ఉదంతాన్ని గుర్తుకు తెచ్చే దారుణం హైదరాబాద్ లో వెలుగు చూసింది. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. నమ్మి వెళ్లినందుకు తెలిసిన కుర్రాడు చేసిన ఈ దుర్మార్గం ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. తల్లిదండ్రులందరికి ఈ ఉదంతం ఒక హెచ్చరికగా మారిందని చెప్పక తప్పదు. పోలీసుల సమాచారం ప్రకారం బాధిత మహిళ మేజర్ కాగా.. ఉన్మాదిగా వ్యవహరించిన కుర్రాడు మైనర్ కావటం షాకింగ్ గా మారింది. అయితే.. ఒకట్రెండు మీడియాలలో వచ్చిన ఈ ఉదంతంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోంది.
జరిగింది ఇదేనా?
లోయర్ ట్యాంక్ బండ్ లోని డీబీఆర్ మిల్స్ ప్రాంతంలో చంద్రానగర్ కాలనీ ఉంది. లిబర్టీ.. ఆయిల్ సీడ్స్ కాలనీకి చెందిన కొందరు బాలురు సాయంత్రం గంజాయి తాగుతుంటారు. స్థానికంగా నివశించే పాలిటెక్నిక్ చదివే (?)19 ఏళ్ల అమ్మాయి వారితో చనువుగా ఉంటుంది. కొద్దికాలంగా ఆమెకు గంజాయిని అలవాటు చేశారు. ఈ నెల 3న అర్థరాత్రి వేళ గంజాయి మత్తులో ఒక కుర్రాడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఆ దృశ్యాల్ని అతని మిత్రుడు వీడియో చిత్రీకరించాడు. గంజాయి మత్తులో హేయంగా ప్రవర్తించాడు. ఆ వీడియోను యూ ట్యూబ్ లో షేర్ చేశాడు. దాన్ని తన స్నేహితులకు వాట్సాప్ చేశాడు. ఈ వీడియోను తొలగించాలని ఆ అమ్మాయి ప్రాధేయపడింది. దీంతో నిందితుడు గురువారం సాయంత్రం ఆమెను డీబీఆర్ మిల్స్ వద్ద కలవాలని డిమాండ్ చేశాడు. దీంతో.. తన స్నేహితుల ఇంటికి వెళుతున్నట్లుగా చెప్పి.. ఆ కుర్రాడు చెప్పిన ప్రాంతానికి వెళ్లింది.
ఆమెను వివస్త్రను చేయటమే కాదు.. ఆమె ప్రైవేట్ పార్ట్స్ మీదా.. ఇతర చోట్ల పదునైన బ్లేడ్ తో కోసి.. ఉన్మాదంతో ఆరాచకంగా వ్యవహరించారు. బ్లేడ్ తో కోసిన అనంతరం ఆమె బాధతో విలవిలలాడుతూ.. ప్రాధేయపడుతున్న దృశ్యాల్ని చిత్రీకరించారు.
ఫ్రెండ్ ఇంటికి వెళ్లిన కుమార్తె ఎంతకూ తిరిగి రాకపోవటంతో కంగారు పడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలిని గుర్తించారు. దారుణానికి పాల్పడిన కుర్రాళ్లను స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేశారు. అతన్ని పోలీసులకు అప్పగించారు. గాంధీనగర్ పోలీసులు ఆ బాలికను గాంధీ ఆసుపత్రికి చేర్పించి.. వైద్యసాయాన్ని అందిస్తున్నారు. ఆమెకు విపరీతమైన రక్తస్రావం జరిగిందని వైద్యులు చెబుతున్నారు. నిందితుల మీద ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడు పెట్టిన వీడియోను పోలీసులు తొలగించారు. కేసును దర్యాప్తు చేయించాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. ఒక ప్రముఖ మీడియాలో వచ్చిన ఈ కథనం సంచలనంగా మారింది. అయితే.. క్షేత్రస్థాయిలో వాస్తవం మరోలా ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇద్దరు మైనర్ల మధ్య జరిగిన ప్రైవేటు వ్యవహారమే తప్పించి.. ఇందులో బ్లేడ్ తో కోసింది.. గాయపర్చింది నిజం కాదన్న మాట వినిపిస్తోంది. సంచలనం కోసం ఇలాంటి కథనం తెర మీదకు తెచ్చారన్న మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా.. ఈ ఇష్యూ మీద పోలీసు అధికారుల వెర్షన్ అధికారికంగా వెల్లడైతే తప్పించి నిజం ఏమిటన్నది చెప్పలేని పరిస్థితి.