Begin typing your search above and press return to search.
గాలికి ఊహించని దెబ్బేసిన మాల్యా!
By: Tupaki Desk | 3 Nov 2017 10:22 AM GMTగాలికి ఊహించని దెబ్బ పడింది. అది కూడా.. ఆయనకు ఏ మాత్రం సంబంధం లేని లిక్కర్ కింగ్ మాల్యా కారణంగా. ఇద్దరూ ఒకే రాష్ట్రానికి చెందిన వారైనప్పటికీ.. వ్యాపార పరంగా సంబంధాలు పెద్ద లేవనే చెప్పాలి. ఓఎంసీ కేసులో నిందితుడిగా ఉంటూ జైల్లో సుదీర్ఘకాలం ఉన్న గాలికి.. విదేశీ పర్యటన కోసం పెట్టుకున్న పిటిషన్ కు కోర్టు నో చెప్పేసింది.
తన కుమార్తె బ్రాహ్మణి వివాహ వార్షికోత్సవానికి లండన్ కు వెళ్లేందుకు వీలుగా అనుమతి కోసం గాలి జనార్దనరెడ్డి పిటిషన్ పెట్టుకున్నారు. దీన్ని విచారించిన కోర్టుకు.. కుమార్తె దగ్గరకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వలేమని తేల్చేసింది. ఈ నెల 5 ఉంచి 20 వరకు లండన్‌కు వెళ్లటానికి తనకు అనుమతి ఇవ్వాలని గాలి కోరారు.
ఈ సందర్భంగా సీబీఐ తరపు న్యాయవాది వాదిస్తూ.. విదేశాలకు వెళితే తిరిగి వచ్చే అవకాశం తక్కువగా ఉందన్న విషయాన్ని ప్రస్తావించారు.అదే జరిగితే కేసు విచారణలో జాప్యం జరిగే వీలుందన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. బ్యాంకులను మోసం చేసి లండన్ కు వెళ్లిన విజయ్ మాల్యా కూడా తిరిగి రాలేదన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలని కోర్టును కోరారు.
సీబీఐ న్యాయవాది వాదనల్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు.. కుమార్తె వివాహ వార్షికోత్సవానికి గాలి జనార్దనరెడ్డిని లండన్ కు వెళ్లేందుకు అనుమతిని నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మాల్యా ప్రస్తావన గాలి జర్నీకి బ్రేకులు పడేసేలా చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.