Begin typing your search above and press return to search.
కోర్టుకు రూ.లక్ష కట్టమన్నారు
By: Tupaki Desk | 18 Aug 2015 5:30 AM GMTఓటుకు నోటు కేసుకు సంబంధించి.. ఏపీ సర్కారు మీద తీవ్రమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. ఈ కేసును సీబీఐ చేత విచారణ జరిపించాలని కోరుతూ ఒక పిటీషన్ హైకోర్టులో దాఖలు కావటం తెలిసిందే. ఈ పిటీషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఆసక్తికర వ్యాఖ్య ఒకటి చేసింది.
ఫిర్యాదుదారు పేర్కొన్న విధంగా ‘‘ఓటుకు నోటు’’ కేసును ఏసీబీ నుంచి సీబీఐకి బదిలీ చేయాలన్న అంశంపై సదుద్దేశమే ఉందని ముందు నిరూపించుకోవాలని..ఇందుకోసం తక్షణం రూ.లక్ష మొత్తాన్ని కోర్టులో డిపాజిట్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు వేసిన ఫిర్యాది దారు కృష్ణయ్య ను రూ.లక్ష డిపాజిట్ చేయాలని.. ఒకవేళ ఫిర్యాదుదారు తాను వినిపించిన వాదనకు అనుకూలంగా కోర్టు నిర్ణయం ఉంటే.. డిపాజిట్ చేసిన రూ.లక్ష మొత్తం తిరిగి ఇచ్చేస్తామని.. లేని పక్షంలో మాత్రం ఇవ్వటం సాధ్యం కాదని పేర్కొంది.
ఏసీబీ నుంచి సీబీఐకి కేసును బదిలీ చేయాలన్న అంశంపై మీకున్న సదుద్దేశాన్ని నిరూపించుకోవాలంటూ హైకోర్టు పేర్కొన్న నేపథ్యంలో.. సీబీఐ విచారణ కోరుతున్న కృష్ణయ్య రూ.లక్ష మొత్తాన్ని హైకోర్టు లో డిపాజిట్ చేస్తారా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.