Begin typing your search above and press return to search.
విద్యార్థులకు కరోనా దెబ్బ - హాస్టళ్లను ఖాళీ చేయాలని ఆదేశాలు
By: Tupaki Desk | 17 March 2020 5:00 PM GMTకరోనా వైరస్ ప్రభావం హాస్టళ్లను తాకింది. కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ముఖ్యంగా గ్రూప్ లుగా ఉండవద్దు. దీంతో ఈ దిశగా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా హాస్టల్స్ ను తాత్కాలికంగా క్లోజ్ చేయాలని పోలీసులు ఆదేశిస్తున్నారు. అమీర్ పేట - ఎస్సార్ నగర్లలోని హాస్టళ్లను మూసివేయాలని నిర్వాహకులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 31వ తేదీ వరకు హాస్టల్స్‌ను ఓపెన్ చేయరాదని ఆదేశించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హాస్టల్స్ నిర్వాహకులతో సమావేశమైన కార్పోరేటర్ శేషుకుమారి - డీసీ గీతారాధిక - పోలీసు ఉన్నతాధికారులు ఈ ఆదేశాలు జారీ చేశారు. బుధవారం (మార్చి 18) సాయంత్రంలోగా హాస్టల్స్ లలో ఉండే విద్యార్థులు - ఉద్యోగులు - ఇతరులను ఖాళీ చేసి వెళ్లిపోవాలని కోరారు. అయితే హఠాత్తుగా వెళ్లిపోమంటే ఎలా అని కొంతమంది ఆందోళన వ్యక్తం చేశారు.
కరోనా వైరస్ నేపథ్యంలో విద్యాసంస్థలను క్లోజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆదేశాల మేరకు విశ్వవిద్యాలయాల్లో క్లాసులను తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఆయా విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు మాత్రం హాస్టళ్లలోనే ఉంటున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు హాస్టళ్లలోనే ఉంటున్నారు. అయితే కరోనా ప్రభావం నేపథ్యంలో వారిని కూడా ఖాళీ చేయాలని వీసీ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం నుండి విద్యుత్ - నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.