Begin typing your search above and press return to search.
కరోనాకు మనోళ్లు ఆర్నెల్లలో మందు తెచ్చేస్తున్నారట
By: Tupaki Desk | 18 March 2020 4:45 AM GMTప్రపంచాన్ని వణికిస్తున్నకరోనాకు చెక్ పెట్టేసే వ్యాక్సిన్ తయారీ విషయంలో ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రయోగాలు.. పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే. జర్మనీకి చెందిన కంపెనీ ఈ విషయంలో ముందడుగు వేసిందన్న వార్తలతో పాటు.. తాజాగా అమెరికా లో వ్యాక్సిన్ తయారు చేశారన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. మనోళ్లు కూడా కరోనాకు మందు తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు. దీనికి సంబంధించి ముమ్మరంగా ప్రయోగాలు చేస్తున్నారు. అదే విషయాన్ని చెబుతున్నారు హైదరాబాద్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సింపుల్ గా చెప్పాలంటే ఐఐసీటీ సంస్థ.
ఈ సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్ తాజాగా ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. కరోనా వైరస్ ను అడ్డుకునేందుకు మూడు యాక్టివ్ ఫార్మాస్యుటికల్ వస్తువుల్ని యుద్ధప్రాతిపదికన డెవలప్ చేస్తున్నట్లు చెప్పారు. దీనికి ప్రముఖ ఫార్మా దిగ్గజం సిప్లా ముందుకు వచ్చినట్లు చెప్పారు.
రానున్న ఆర్నెల్ల వ్యవధిలో కోవిడ్ 19తో పాటు వివిధ వైరస్ లకు విరుగుడు గా పని చేసే ఔషదాల్ని తీసుకొస్తామన్న ధీమాను వ్యక్తం చేశారు. ఇప్పుడున్న అత్యవసర పరిస్థితుల్లో రెండు తమ రెండు సంస్థలు చేతులు కలిపామని.. ఎలాంటి షరతులు లేకుండా ముందు మందు కనుగొనే ప్రయత్నంలో ఉన్నామన్నారు.
జపాన్ కు చెందిన ఫావిపిరవిర్ అనే ఆర్ఎన్ఏను వైరస్ లకు విరుగుడుగా వాడుతున్నామని.. దీనికి సంబంధించిన పేటెంట్ ఇప్పటికే అయిపోయిందని చెప్పారు. మరో యాంటీ వైరల్ డ్రగ్ బలోక్సావిర్ కూడా విరుగుడుగా పని చేస్తుందన్న ఆలోచన ఉందన్నారు. వైరస్ కు చెక్ పెట్టే వ్యాక్సిన్ కు అవసరమైన ముడి పదార్థాల్ని పెద్ద ఎత్తున సమీకరించామన్నారు. చంద్రశేఖర్ మాటల్ని చూస్తే.. రానున్న కొద్ది నెలల్లో కరోనా భూతానికి చెక్ పెట్టే వ్యాక్సిన్ తయారు కానుందన్న భరోసా కలగటం ఖాయం.