Begin typing your search above and press return to search.
గంజాయి సిటీ గా మారి పోతున్న హైదరాబాద్
By: Tupaki Desk | 28 Dec 2019 9:30 AM GMTగంజాయి ..హైదరాబాద్ మహా నగరాన్ని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్యల లో ఇది కూడా ఒకటి. హైదరాబాద్ డ్రగ్స్ , గంజాయి అడ్డాగా నిలుస్తుంది. ఈ గంజాయి రవాణా అరి కట్టేందుకు పోలీసులు ఎంత నిఘా పెంచుతున్నప్పటికీ డ్రగ్స్ ముఠాలు కూడా అంతే స్థాయిలో కొత్త తరహాలో అక్రమ మార్గాలు వెతుకుతున్నారు.గత కొన్ని రోజుల వ్యవధి లోనే పలు డ్రగ్స్ ముఠాల గుట్టుని పోలీసులు బయట పెట్టినా కూడా హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా ఆగడం లేదు. తాజాగా పోలీసులు మరో గంజాయి ముఠాని పట్టుకున్నారు.
తాజాగా విశాఖపట్నం నుంచి ఆరుగురు వ్యక్తులు హైదరాబాద్ కు గంజాయి తరలిస్తుండగా, దీనిపై పక్కా సమాచారం రావడంతో దాడి చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రెండు కార్లలో తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారు. అలాగే హైదరాబాద్, పాత బస్తీలోని సంతోష్ నగర్ పరిధిలో ఆకస్మిక దాడులు చేసిన పోలీసులు రెండు కార్ల లో తరలిస్తున్న 400 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఆరుగురిని అదుపు లోకి తీసుకున్నారు. ఈ ముఠా నుండి రెండు కార్లు స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం ఆరుగురిని చంద్రాయణ గుట్ట పోలీసుల కు ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది అప్పగించారు.
ఇక పోతే కొత్త సంవత్సర వేడుకల ను టార్గెట్ గా చేసుకుని హైదరాబాద్ లో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తున్న ముఠాను గురువారం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారి నుంచి రూ. 15 లక్షల విలువైన బ్రౌన్ షుగర్, గంజాయి, కారు ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన ను మరువక ముందే మరో గంజాయి ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. దీనితో హైదరాబాద్ గంజాయి కి అడ్డా గా మారి పోయింది అని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.