Begin typing your search above and press return to search.

ఖరీదైన గృహాల్లో హైదరాబాద్ 2వ స్థానం..

By:  Tupaki Desk   |   12 March 2022 7:35 AM GMT
ఖరీదైన గృహాల్లో హైదరాబాద్ 2వ స్థానం..
X
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ గా దూసుకుపోతుందని సీఎం కేసీఆర్ పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇతర ప్రజాప్రతినిధులు తెలంగాణ రోల్ మోడల్ గా తయారైందని అంటున్నారు. అయితే తాజా పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఖరీదైన నగరాల్లో భాగ్యనగరం చేరుతోంది.

హైదరాబాద్లో శ్రీమంతులు ఏ విధంగా పెరుగుతున్నారో.. అంతే స్థాయిలో ఖరీదైన భవనాలు కూడా నిర్మాణం జరుపుకుంటున్నాయి. ఉద్యోగ భద్రత పెరగడం, కొత్త ఉద్యోగ అవకాశాల కల్పన, మెరుగైన మౌలిక సదుపాయాలు ఏర్పడడంతో నగర రియల్టీ మార్కెట్ పుంజుకుంటుందని రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ప్రాప్ టైగర్ అంచనా వేసింది.

2021లో అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ (యూహెచ్ఎన్ఐ) సంబంధించిన హైదరాబాద్లో 467కి చేరింది. ఇది 2026 నాటికి 56 శాతం వృద్ధి రేటుతో 728 కి చేరుతుందని ప్రాపర్టీ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్త్ రిపోర్ట్ -2022 వెల్లడించింది. 2016లో హైదరాబాద్లో యూహెచ్ఎన్ఐ సంఖ్య 314 ఉండగా ఐదేళ్లలో 467కు చేరింది. దీంతో దేశంలో యూహెచ్ఎన్ఐ సంఖ్య కలిగిన హైదరాబాద్ కు రెండో స్థానం లభించింది. మొదటి స్థానంలో ముంబయ్ 1,596 గా ఉంది. 30 మిలియన్ల డాలర్ల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్లను యూహెచ్ఎన్ఐలుగా పరిగణిస్తుంటారు.

హైదరాబాద్లో గత ఐదేళ్లలో రియాల్టీ బిజినెస్ విపరీతంగా పెరిగింది. గతేడాది అక్టోబర్-డిసెంబర్ ల మధ్య నగర స్థిరాస్తి ధరలు 7 శాతం పెరిగాయి. పెరిగిన ధరల తరువాత దేశంలో అత్యంత ఖరీదైన నగరాల్లో ముంబై తరువాత హైదరాబాద్ కే దక్కింది. కరోనా మహమ్మారి తరువాత నగరంలో భవన నిర్మాణాలు విపరీతంగా పెరిగాయి. ఇందుకు అనుగుణంగా నిర్మాణ సామగ్రి రేట్లు కూడా పెరిగాయి. దీంతో కొత్త అపార్ట్ మెంట్ల ధరలు కూడా ఎగబాకాయి.

నగరంలో ప్రస్తుతం చదరపు అడుగులకు రూ.5,900 నుంచి రూ.6,100 వరుక ఉంది. గతేడాది క్యూ4లో అహ్మదాబాద్ తో సహా నగరంలో అత్యధిక ధరలలు నమోదయ్యాయని ప్రాప్ టైగర్ బిజినెస్ హెడ్ రాజన్ పేర్కొన్నారు. 2020 క్యూ 4 తో పోలిస్తే గతేడాది క్యూ 4 లో హైదరాబాద్ గృహాల విక్రయాల్లో 36 శాతం వృద్ధి రేటు కనిపించింది.

2020 నాల్గో త్రైమాసికంలో 16,400 యూనిట్లు విక్రయం కాగా.. గతేడాది అక్టోబర్ -డిసెంబర్లో 22,239 గృహాలు విక్రయాలు జరిగాయి. మియాపూర్, బాచుపల్లి, తెల్లాపూర్ ప్రాంతాల్లో భవన నిర్మాణాలు అత్యదికంగా సాగాయి. ఇక ప్రజలు త్రిబుల్ బెడ్రూం ప్లాట్ల కొనుగోలుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఇక అత్యధిక మెరాజిటీ యూనిట్ల లాంగింగ్స్ పుష్పాలగూడ, మియాపూర్, బాచుపల్లి ప్రాంతా్లో జరిగాయి.