Begin typing your search above and press return to search.
ఐటీ కారిడార్ కు ఇంకో వరం ప్రకటించిన కేటీఆర్
By: Tupaki Desk | 11 Dec 2017 12:09 PM GMTవిశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ ఖాతాలో మరో ప్రత్యేకత చేరనున్నట్లు రాష్ట్ర ఐటీ - పురపాలక శాఖామంత్రి కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారు. పాస్ట్ గ్రోయింగ్ సిటీగా ఎదుగుతున్న హైదరాబాద్ ప్రజలకు మెట్రో అందుబాటులోకి వచ్చేసిందని... ఇప్పుడు హైదరాబాద్ మెట్రో లేకుండా లైఫ్ లేదని అన్నారు. ఐటీ కారిడార్లో ప్రజల కోసం మరో నూతన సేవలను ప్రవేశపెట్టే యోచన చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సేవల సంస్థ సీబీఆర్ ఈ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.
ప్రజారవాణాకు మెట్రో రైలు వంటి ఆధునిక సదుపాయాలు తెచ్చామని పేర్కొన్న మంత్రి కేటీఆర్ హైదరాబాద్ మెట్రోకు అనూహ్యమైన స్పందన వస్తుందని తెలిపారు. మెట్రో రైలులో రోజుకూ లక్ష మందికి పైగా ప్రయాణం చేస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో మెట్రోను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తామని మంత్రి చెప్పారు. మెట్రో మొదటి దశతో పెట్టుబడిదారులకు మరిన్ని అవకాశాలు వచ్చాయన్నారు. ఐటీ కారిడార్ ను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు మోనోరైలును ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి వివరించారు.
నూతన పారిశ్రామిక విధానం వల్ల పెట్టుబడులు అనేకం వచ్చాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ లో ఆఫీస్ స్పేస్ కు భారీ డిమాండ్ వచ్చిందన్నారు. ఆఫీస్ స్పేస్ అబ్జార్షన్ లో నగరంలో మంచి అభివృద్ధి సాధిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఆఫీస్ స్పేస్ విషయంలో 2015తో పోల్చితే 2017లో డిమాండ్ రెట్టింపు అవడం హైదరాబాద్ కు ఉన్న అనుకూలతవల్లేనని వెల్లడించారు. ఢిల్లీ - బెంగళూరు - చెన్నై కంటే హైదరాబాద్ సురక్షితమైన నగరమని మంత్రి స్పష్టం చేశారు. భౌగోళిక పరంగాను హైదరాబాద్ ప్రపంచంలోనే బెస్ట్ సిటీ అని చెప్పారు. 19 వేల ఎకరాల్లో ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా క్లస్టర్ ను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఉప్పల్ - ఆదిభట్ల వైపు పారిశ్రామికవేత్తలు దృష్టి సారించాలన్నారు. హైదరాబాద్ తూర్పు వైపు కూడా అభివృద్ధికి అవకాశాలున్నాయని కేటీఆర్ వివరించారు. దీని వల్ల ప్రత్యక్షంగా - పరోక్షంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతుందన్నారు.