Begin typing your search above and press return to search.
మోడీ సభ కారణంగా హైలెట్ కాని హైదరాబాద్ ఐటీ ఉద్యోగి దారుణ హత్య
By: Tupaki Desk | 4 July 2022 12:14 AM GMTఒక యువ ఐటీ ఇంజినీర్ ను కేవలం ప్రేమించాడన్న కారణంగా దారుణంగా చంపేసిన వైనం తెలిస్తే నోట మాట రాదు. మతం ఒక్కటే.. కులం ఒక్కటే.. హోదా ఒక్కటే.. వంక పెట్టేందుకు వీల్లేని విధంగా.. వేలెత్తి చూపించేందుకు అవకాశం అంశంలోనూ.. తమను కాదని ప్రేమ వివాహం చేసుకున్నాడన్న ఒకే ఒక్క కారణంతో దారుణంగా హత్య చేసిన వైనం షాకింగ్ గా మారింది. నిజానికి ఈ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారటమే కాదు.. మీడియాలోనే పెద్ద ఎత్తున హైలెట్ కావాల్సింది.
బ్యాడ్ లక్ ఏమంటే.. హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు.. మోడీ బహిరంగ సభ.. తెలంగాణ అధికారపక్షం హడావుడితో ఒకలాంటి రాజకీయ వాతావరణం తెలంగాణ మొత్తాన్ని కమ్మేసింది. దీంతో.. మిగిలిన విషయాల మీద ప్రజలు.. మీడియా.. సోషల్ మీడియా చూపు పడే పరిస్థితి లేదు. ఈ హడావుడిలోనే ఒక దారుణ హత్యోదంతం ఒకటి బయటకు వచ్చింది. నిజానికి.. మోడీ సభ లేని పక్షంలో ఈ హత్య పెను సంచనలనం అయ్యేది. షాకింగ్ గా మారిన ఈ హత్యకు దారి తీసిన కారణాలు చూసినోళ్లంతా ముక్కున వేలేసుకునే పరిస్థితి. అసలేం జరిగిందంటే..
ప్రేమ వివాహాల్లో సహజంగా ఎదురయ్యే మతం.. కులం.. స్థాయి పట్టింపులు లాంటివేమీ ఇప్పుడు చెప్పే లవ్ స్టోరీలో లేవు. ఆ మాటకు వస్తే ప్రేమలో పడిన అబ్బాయి.. అమ్మాయి ఇద్దరు కూడా ప్రకాశం జిల్లాకు చెందిన వారే. గిద్దలూరు మండలం పొదలకొండపల్లికి చెందిన 26 ఏళ్ల నారాయణ రెడ్డి ఐటీ ఉద్యోగిగా పని చేస్తున్నారు. తమ గ్రామానికి చెందిన వెంకటేవ్వరరెడ్డి కుమార్తె రవళితో ప్రేమలో పడ్డారు. వారిద్దరిది ఒకే సామాజిక వర్గం కావటంతో పెద్దగా పట్టింపులు ఉండవనే అనుకున్నారు. కానీ.. రవళి తల్లిదండ్రులు నారాయణరెడ్డి ప్రేమకు నో చెప్పారు.
దీంతో.. పెద్దలకు తెలీకుండా ఈ ఇద్దరు ప్రేమికులు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఢిల్లీలో కాపురం పెట్టేశారు. ఇదిలా ఉండగా.. కొంతకాలానికి నారాయణ రెడ్డితో మాటలు కలిపిన రవళి తల్లిదండ్రులు.. కొంతకాలం తమ అమ్మాయిని ఇంటికి పంపాలని కోరారు. తమ ప్రేమ పెళ్లిని పెద్దలు ఓకే చేశారని నమ్మిన నారాయణ రెడ్డి.. రవళి తల్లిదండ్రులు కోరినట్లే భార్యను వారింటికి పంపారు. అయితే.. తమ కుమార్తె ఇంటికి చేరిన వెంటనే తమలోని అసలు కోణాన్ని బయటపెట్టిన వారు.. ఆమెను హౌస్ అరెస్టు చేశారు.
దీంతో తన భార్యను తన దగ్గరకు తీసుకొచ్చేందుకు వీలుగా నారాయణ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు మకాం మార్చి.. ఐటీ కంపెనీలో జాబ్ సంపాదించి.. కుకట్ పల్లిలో ఉంటున్నాడు. తన భార్యను అప్పగించాలంటూ రవళి కుటుంబ సభ్యుల మీద హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ నేపథ్యంలో కోర్టులో రవళి అభిప్రాయం అడిగితే తల్లిదండ్రుల వద్ద ఉంటానని చెప్పటంతో ఆమె అభిప్రాయానికి తగ్గట్లు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. రవళికి మరో పెళ్లి చేసేందుకు వారి తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తుండటం.. అందుకు ఆమె రిజెక్టు చేస్తూ వస్తోంది. అదే సమయంలో తమ ఇంట్లో వారికి తెలీకుండా భర్తతో మాట్లాడేది.
ఈ విషయాన్ని తెలుసుకున్న రవళి తండ్రి.. నారాయణ రెడ్డిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించారు. ఆ బాధ్యతను నారాయణ రెడ్డికి పరిచయం ఉన్న రవళికి వరుసకు సోదరుడు అయ్యే శ్రీనివాసరెడ్డి (అతడిది నారాయణరెడ్డి వారి ఊరే)కి అప్పజెప్పాడు. ఈ నేపథ్యంలో తన స్నేహితులతో కలిసి గత నెల 27న నారాయణ రెడ్డి ఇంటికి వెళ్లిన శ్రీనివాసరెడ్డి.. మాట్లాడుకుందామని కారులో బయటకు తీసుకెళ్లాడు. అతడి మాటల్ని నమ్మిన నారాయణ రెడ్డి వారితో కలిసి కారులో వెళ్లాడు. నారాయణ రెడ్డిని కారులో డ్రైవర్ సీటు పక్కన కూర్చోబెట్టారు. తన వెంట తెచ్చుకున్న ఆసిఫ్ తో కారు నడపమని చెప్పిన శ్రీనివాసరెడ్డి.. తాను మాత్రం వెనుక సీట్లో కూర్చున్నాడు.
జేఎన్ టీయూలోని ఒక మద్యం దుకాణంలో మద్యాన్ని తీసుకొని ఖాజాగూడ వైపు వెళ్లి.. ఒక నిర్మానుష్య ప్రాంతంలో మద్యం సేవించారు. కారు ఎక్కిన తర్వాత.. ముందుసీట్లో కూర్చున్న నారాయణ రెడ్డి మెడకు నైలాన్ తాడు ఉరి బిగించి హత్య చేశారు. అనంతరం కారును జిన్నారం వైపు తీసుకెళ్లి.. ఎవరూ లేని ప్రాంతంలో అతడ్ని పడేసి.. తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. బయటకు వెళ్లిన స్నేహితుడు ఎంతకూ రాని నేపథ్యంలో అతని రూమ్మేట్ కేపీహెచ్ బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నారాయణ రెడ్డి ఆచూకీ లేకపోవటంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. సెల్ ఫోన్ డేటా ఆధారంగా ఆసిఫ్ ను అదుపులోకి తీసుకొని.. తమదైన శైలిలో విచారించగా.. జరిగిన దారుణాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పేశాడు. దీంతో జిన్నారంలోని నల్లూరు గ్రామ శివారుకు వెళ్లగా.. గుర్తు పట్టలేని స్థితిలో ఉన్న డెడ్ బాడీని పోలీసులు స్వాధీనం చేసుకొని గాంధీ ఆసుపత్రికి తరలించారు. నిందితుల్లో వెంకటేశ్వరరెడ్డిని.. శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమించిన పాపానికి.. పెద్దల పెద్దరికాన్ని క్వశ్చన్ చేసినందుకు నిండు ప్రాణాల్ని బలి తీసుకున్న వైనం షాకింగ్ గా మారింది.