Begin typing your search above and press return to search.
జస్టిస్ ఎన్వీ రమణ ఫోటోను హైదరాబాద్ జర్నలిస్టులు జేబులో పెట్టుకోవాల్సిందే!
By: Tupaki Desk | 25 Aug 2022 1:30 PM GMTదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా వ్యవహరిస్తున్న ఎన్వీ రమణ.. తన పదవీ విరమణకు ఒక రోజు ముందు.. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఒక కేసును తేల్చేశారు. వందలాది మంది హైదరాబాద్ జర్నలిస్టుల సొంతింటి కలను నెరవేర్చటంలో ఆయన కీలక భూమిక పోషించారని చెప్పాలి. ఒక విధంగా చెప్పాలంటే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్ జర్నలిస్టులు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఫోటోను జేబులో పెట్టుకోవాల్సిందే.ఎందుకంటే.. వారి సొంతింటి కలను నెరవేర్చటం కోసం ఏళ్లకు ఏళ్లుగా పోరాడుతున్నా.. న్యాయం లభించని వేళ.. తన పదవీ కాలం పూర్తి అయ్యే రోజుముందు ఆయన ఇచ్చిన తీర్పు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని వర్కింగ్ జర్నలిస్టులకు కొన్నేళ్ల క్రితం ప్రభుత్వం భూములుకేటాయించింది. దీనికి సంబంధించి జర్నలిస్టులు కొంత మొత్తాన్ని డిపాజిట్ కూడా చేశారు. అయితే.. ఆ భూ కేటాయింపుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. కోర్టు మీద కోర్టు వెళుతూ.. చివరకు సుప్రీంకోర్టులో ఏళ్లకు ఏళ్లుగా అలా పెండింగ్ లో ఉంది. తాజాగా ఆ కేసుకు సంబంధించిన తుది తీర్పును జస్టిన్ ఎన్వీ రమణ తేల్చేశారు. జర్నలిస్టులకు ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల్ని కేటాయించాని.. నిర్మాణానికి ఓకే చేయాలన్న ఆదేశాల్ని జారీ చేశారు.
పన్నెండేళ్ల క్రితం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని.. దానికి అభ్యంతరాలు చెప్పటాన్ని ఆయన తప్పు పట్టారు. జర్నలిస్టుల వ్యవహారాన్ని బ్యూరోక్రాట్లు.. ప్రజాప్రతినిధులతో ముడిపెట్టకూడదని స్పష్టం చేశారు. తాను ఐఏఎస్.. ఐపీఎస్ ల గురించి మాట్లాడటం లేదని.. ఒక చిన్న జర్నలిస్టు ఎందుకు ఇబ్బంది పడాలని ప్రశ్నించారు.
‘రూ.8వేల నుంచి రూ.50వేల జీతం తీసుకునే సుమారు 8 వేల మంది జర్నలిస్టల అభ్యర్థనను పరిగణలోకి తీసుకుంటున్నాం. వారికి భూమి కేటాయించారు. కానీ డెవలప్ చేయలేదు. వారంతా కలిసి స్థలం కోసం రూ.1.33 కోట్లు డిపాజిట్ చేశారు.
జర్నలిస్టులు ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవటానికి మేం అనుమతిస్తున్నాం’అని జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. అంతేకాదు.. వారు తమ స్థలంలో నిర్మాణాల్ని కూడా జరుపుకోవచ్చని స్పష్టం చేశారు.
అదే సమయంలో ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలకు సంబంధించిన మిగతా కేసును ఇంకో బెంచ్ ముందు లిస్టు చేయమని సీజేఐ పేర్కొన్నారు. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఇచ్చిన ఆదేశాలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పుతో ఎంతోకాలం పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల సమస్య తీరుతుందని పేర్కొన్నారు. ఏమైనా.. ఈ తీర్పు హైదరాబాద్ లోని వందలాది జర్నలిస్టులకు మేలు చేయటంతో పాటు వారికి సొంతింటి కలను నెరవేరుస్తుందని చెప్పక తప్పదు.