Begin typing your search above and press return to search.

ఇంట్లోనే గంజాయి పంట.. హైదరాబాదీ తెగింపు

By:  Tupaki Desk   |   3 Jan 2017 7:46 AM GMT
ఇంట్లోనే గంజాయి పంట.. హైదరాబాదీ తెగింపు
X
గుట్టుగా సాగించే గంజాయి సాగును కొండలు కోనలు - ఏజెన్సీ ప్రాంతాల్లో వేస్తుంటారు. వేరే పంటల్లో కలిపేసి ఎవరికీ తెలియకుండా పండిస్తుంటారు. కానీ... హైదరాబాద్ నట్టనడిబొడ్డున ఓ వ్యక్తి దర్జాగా గంజాయి పండించేస్తున్నాడు. తన అపార్ట్‌మెంట్‌లోనే పువ్వుల మొక్కలు పెంచుకుంటున్నట్లుగా గంజాయిని భారీ ఎత్తున పెంచేస్తున్నాడు. అయితే... ఎన్ని వేషాలేసినా విషయం మాత్రం బయటపడిపోయింది.

మణికొండ ఫ్రెండ్స్‌ కాలనీకి చెందిన ప్రైవేట్‌ ఉద్యోగి సయ్యద్‌ షాహెద్‌ హుస్సేన్‌ వైకే రెసిడెన్సీ అపార్ట్‌ మెంట్‌ లో నివసిస్తున్నాడు. గంజాయి తాగడం అలవాటు ఉన్న ఇతడు కొన్నాళ్లుగా గంజాయి వ్యాపారం కూడా చేస్తున్నాడు. తాండూరులో కేజీ రూ.3,500 చొప్పున గంజాయి ఖరీదు చేసుకొని వచ్చి.. ఇక్కడ రూ.16 వేల చొప్పున అమ్మేవాడు. ఈ క్రయ విక్రయాల నేపథ్యంలో హుస్సేన్‌ కు మూడు నెలల క్రితం గంజాయి సాగు ఆలోచన వచ్చింది. ఎక్కడో పండించిన గంజాయి.. ఎన్నో రోజుల తర్వాత తీసుకువచ్చి విక్రయిస్తున్నా లాభం వస్తోందని, అలాగాకుండా తానే పండించి తాజా సరుకు అమ్మితే మరింత లాభాలు పొందచ్చని భావించాడు. ఆ ఆలోచనను వెంటనే అమల్లో పెట్టి ఫ్లాట్‌ నే పొలంగా మార్చేశాడు.

తన ఫ్లాట్‌ లోని హాలు - లివింగ్‌ ఏరియా - కారిడార్‌ ల్లో 40 కుండీల్లో గంజాయి సాగు చేశాడు. ఈ పంట చేతికి వచ్చిన తర్వాత నగరంలోని విద్యార్థులు - సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్లకు విక్రయించేందుకు పథకం వేశాడు. ఈ లోపు ఇతర ప్రాంతాల నుంచి సేకరించిన గంజాయిని విక్రయించడం కొనసాగించాడు. ఇటీవల కొన్న 8.6 కేజీల గంజాయిని అమ్మడానికి సోమవారం గోల్కొండ ప్రాంతానికి చేరుకున్నాడు. అది అమ్మబోతూ దొరికిపోయాడు... ఆ క్రమంలో సోదాల్లో ఈ సంగతీ బయటపడిపోయింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/