Begin typing your search above and press return to search.

బీజేపీ కార్పొరేటర్లు టచ్ లో ఉన్నారన్న హైదరాబాద్ మేయర్

By:  Tupaki Desk   |   12 April 2021 3:30 PM GMT
బీజేపీ కార్పొరేటర్లు టచ్ లో ఉన్నారన్న హైదరాబాద్ మేయర్
X
టీఆర్ఎస్ నుంచి ఇటీవలే ఎన్నికైన హైదరాబాద్ నగర మేయర్ విజయలక్ష్మీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కొన్ని వివాదాస్పద చర్యలతో వార్తల్లో నిలిచిన ఆమె తాజాగా బీజేపీని టార్గెట్ చేశారు.

హైదరాబాద్ నగరంలోని బీజేపీ కార్పొరేటర్లు తనతో టచ్ లో ఉన్నారని మేయర్ విజయలక్ష్మీ బాంబు పేల్చారు. వారు గెలిచిన డివిజన్ల అభివృద్ధికి తాను కృషి చేస్తానని మేయర్ తెలిపారు. ఈ నెలాఖరున లేదా వచ్చే నెలలో కౌన్సిల్ సమావేశం ఉంటుందని విజయలక్ష్మీ తెలిపారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో హంగ్ వచ్చింది. ఇందులో అధికార టీఆర్ఎస్ పార్టీ 56 స్తానాలతో ఎక్కువ స్థానాలు గెలిచింది. కానీ మెజార్టీకి సరిపడా సీట్లు దక్కించుకోలేదు.. ఆ తర్వాత ఎంఐఎం 42 స్థానాల్లో గెలిచింది. బీజేపీ 48 స్థానాల్లో గెలిచింది. ఇక కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలను మాత్రమే గెలుచుకుంది.

ఈ క్రమంలోనే ఎంఐఎం మద్దతుతో టీఆర్ఎస్ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. కానీ స్వతహాగా బలం లేకపోవడంతో ఇప్పుడు బీజేపీ కార్పొరేటర్లకు వల వేస్తున్నట్టు తెలుస్తోంది.