Begin typing your search above and press return to search.
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్.. చార్జీలు పెంచేందుకు రంగం సిద్ధం?
By: Tupaki Desk | 31 Oct 2022 4:20 AM GMTహైదరాబాద్ లో మెట్రో రైల్లో ప్రయాణించే అలవాటు ఉందా? అయితే.. ఇది మీ కోసమే. మీరు దీన్ని చదవటం మిస్ అయితే.. జరిగే నష్టం ఎక్కువే. అదెలానో మేం మీకు చెబుతాం. హైదరాబాద్ మెట్రో రైలు టికెట్ ఛార్జీల్ని పెంచేందుకు వీలుగా ఎల్ అండ్ టీ సంస్థ తాజాగా దరఖాస్తు చేసుకుంది. ఛార్జీల పెంపు ఎంత అవసరమన్న విషయాన్ని సంస్థ చెప్పేయటంతో పాటు.. ఛార్జీల సవరణ అంశాన్ని త్వరగా తేల్చాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (ఛార్జీలను నిర్దారించే కమిటీ)ను ఏర్పాటు చేసింది.
ఈ కమిటీలో హైకోర్టు రిటైర్డు జడ్జితో పాటు.. పలువురు కీలక అధికారులకు చోటు కల్పించింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఉన్న ఛార్జీలు.. వాటిపై సలహాలు.. సూచనలు చేసేందుకు ప్రజలకు అవకాశం కల్పించారు. నవంబరు 15లోపు మెట్రో టికెట్ చార్జీలకు సంబంధించిన అభిప్రాయాల్ని తెలియజేయాలని పేర్కొన్న కమిటీ..
అందుకు ఒక మొయిల్ ఐడీని కూడా ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. ప్రయాణికులు తమ అభిప్రాయాల్ని.. ffchmrl@gmail.com కు మొయిల్ చేయాలని.. లేదంటే.. ఛైర్మన్, ఫేర్ ఫిక్సేషన్ కమిటీ.. మెట్రో రైలు భవన్, బేగంపేట 500003 అడ్రస్ కు పంపాలని కోరారు.
ప్రయాణికులు తమ అభిప్రాయాల్ని తెలియజేస్తూ.. మెట్రో టికెట్ ఛార్జీలను పెంచే విషయంపై తమకున్న అభ్యంతరాల్ని వెల్లడించటం ద్వారా.. ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటంతో పాటు.. కమిటీ నిర్ణయం మీదా ప్రభావటం ఉంటుందని చెబుతున్నారు. ధరల పెంపు భారం మోయటానికి ముందు.. మెట్రోలో ప్రయాణించే వారంతా ఒక మొయిల్ పంపాల్సిన అవశ్యకత ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
మెట్రో రైలు చట్టాల ప్రకారం మెట్రో రైలు ఆడ్మినిస్ట్రేషన్ కు మొదటి సారి మాత్రమే చార్జీల్ని పెంచే వీలుంది. ఆ తర్వాత నుంచి కేంద్రం నియమించే ఫేర్ ఫిక్సేషన్ కమిటీ చేతుల్లో ఉంటుంది. అందుకే.. తమ అభిప్రాయాల్ని నిక్కచ్చిగా మెట్రో ప్రయాణికులు వెల్లడించాల్సిన అవసరం ఉందంటున్నారు. ఛార్జీలు ఎంత పెంచాలన్నది ఇంకా నిర్ణయించలేదని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి చెప్పిన మాటల్ని చూసినప్పుడు.. మెట్రో ప్రయాణికులు తమ మొయిల్ అస్త్రాలతో రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.