Begin typing your search above and press return to search.
గ్రేటర్ వాసులకు హ్యాపీ డే..!
By: Tupaki Desk | 24 Sep 2018 5:47 AM GMTహైదరాబాద్ లో ఉన్న వారికి మాత్రమే కాదు.. హైదరాబాద్ గురించి ఏ మాత్రం అవగాహన ఉన్న వారైనా సరే.. ఇవాల్టి ప్రత్యేకత గురించి చెప్పినంతనే హ్యాపీగా ఫీల్ కావటం ఖాయం.మియాపూర్ నుంచి ఎల్ బీ నగర్ కు వెళ్లాలన్న మాట విన్నంతనే.. వామ్మో అన్న మాట వస్తుంది.
మియాపూర్ నుంచి ఎల్ బీ నగర్ రోడ్డు మార్గంలో గట్టిగా 30 కిలోమీటర్లు లేకున్నా.. బస్సు.. కారు.. బైకు.. వాహనం ఏదైనా సరే..కనీసం రెండు గంటలు.. మాగ్జిమం మూడు గంటల వరకూ పట్టే పరిస్థితి. అలాంటిది ఈ ప్రయాణాన్ని కేవలం 50 నిమిషాల్లో పూర్తి చేయటం.. అది కూడా రద్దీ వేళల్లో అయినా అంటే.. అంతుకు మించిన స్వీట్ న్యూస్ ఏముంటుంది?
ఇంతకీ.. అంత దూరాన్ని అంత తక్కువ సమయంలో ఎలా జర్నీ చేయటం అంటారా? ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఎల్ బీ నగర్ కు మెట్రో కల ఈ రోజు సాకారం కానుంది.
మియాపూర్ నుంచి అమీర్ పేట వరకూ మెట్రో మార్గం మొదలై దాదాపు 10 నెలలకు పైనే అయ్యింది. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఆర్నెల్ల ముందే అమీర్ పేట - ఎల్ బీ నగర్ మార్గం అందుబాటులోకి రావాల్సి ఉంది. కారణాలు ఏమైనా కానీ.. వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. ఈ రోజు (సోమవారం) మధ్యాహ్నం 12-15 గంటలకు గవర్నర్ నరసింహన్ చేతుల మీదుగా ఈ మార్గం అధికారికంగా ఓపెన్ కానుంది.
అనంతరం మూడు గంటల తర్వాత.. అంటే.. మధ్యాహ్నం 3 గంటలకు అమీర్ పేట - ఎల్ బీనగర్.. ఎల్ బీ నగర్ - అమీర్ పేట మధ్య మెట్రో రైలు సామాన్యులకు అందుబాటులోకి రానుంది. ఈ ప్రయాణంలో మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఎల్ బీ నగర్ లో మెట్రో ఎక్కితే.. నేరుగా మియాపూర్ వరకూ ట్రైన్ మారాల్సిన అవసరం ఉండదు.
ఇప్పటివరకూ ఉన్న దాని ప్రకారం నాగోల్ నుంచి మియాపూర్ వెళ్లాలంటే.. మధ్యలో ట్రైన్ మారాల్సిన అవసరం ఉంటుంది. కానీ.. మియాపూర్ - ఎల్ బీనగర్ మార్గంలో మాత్రం రైలు మారాల్సిన అవసరం ఉండదు. అదే సమయంలో..వేరే మార్గాల నుంచి నాగోల్ నుంచి వచ్చే వారు.. నాగోల్‌కు వెళ్లే వారు మాత్రం తప్పనిసరిగా అమీర్ పేటలో ట్రైన్ మార్చాల్సిన అవసరం ఉంటుంది.
మెట్రో ఫేజ్ 1లో కీలకమైన అమీర్ పేట - ఎల్ బీనగర్ మార్గం ప్రజలకు అందుబాటులోకి రావటం ద్వారా లక్షలాది మంది మెట్రోను ఉపయోగించటం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందుల్ని అధిగమించే వీలుందని చెప్పక తప్పదు. అమీర్ పేట నుంచి ఎల్ బీనగర్ మధ్యలో మొత్తం 17 స్టేషన్లు ఉన్నాయి. ఇక మియాపూర్ నుంచి ఎల్ బీనగర్ కు మధ్య మొత్తం 29కిలోమీటర్ల మార్గాన్ని 52 నిమిషాల్లో పూర్తి చేసే వీలుంది.
ప్రతి 5 నిమిషాలకు ఒక ట్రైన్ అందుబాటులోకి వస్తుంది. రద్దీ పెరిగిన తర్వాత ప్రతి 2 నిమిషాలకు ఒక ట్రైన్ అందుబాటులోకి రానుంది. అత్యంత రద్దీగా ఉంటుందని భావిస్తున్న ఈ రూట్లో ఎంజీబీఎస్ దగ్గర అతి పెద్ద స్టేషన్ గా చెబుతున్నారు.
ఈ రూట్ ప్రత్యేకత ఏమంటే.. పలు చారిత్రక కట్టడాలు చూసే వీలుంటుంది. నిత్యం ట్రాఫిక్ నరకాన్ని చూసే నగర జీవులకు ఈ మార్గంలో మెట్రోఅందుబాటులోకి రావటం అద్భుతమైన అనుభూతిగా చెప్పక తప్పదు. తొలి రోజున 50 వేల మంది.. తర్వాతి నుంచి నిత్యం లక్ష మంది ఈ మార్గంలో ప్రయాణిస్తారని భావిస్తున్నారు. అయితే.. మియాపూర్ - ఎల్ బీ నగర్ మధ్య ప్రయాణానికి మెట్రో టికెట్ రూ.60గా ఉండనుంది. సగటు జీవికి ఈ టికెట్ కాస్త భారంగా ఉంటుందన్న అభిప్రాయం ఉంది. మరి.. నగర జీవులు ఈ భారానికి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.