Begin typing your search above and press return to search.
హైదరాబాద్ మెట్రో పరుగుకు డేట్ ఫిక్స్
By: Tupaki Desk | 3 Jun 2020 4:30 AM GMTలాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని మెట్రోలను ఆపేసిన వైనం తెలిసిందే. అన్ లాక్ 1.0 వేళ.. ఇప్పటికే పలు మినహాయింపుల్ని తెర మీదకు తెచ్చిన కేంద్రం.. రానున్న కొద్ది రోజుల్లో మెట్రో రైళ్లను సైతం పట్టాల మీదకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. ఈ నెల మూడో వారంలో మెట్రో రైళ్లు పరుగులు తీసే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు కాకున్నా.. మరో రెండు వారాల్లో ఖాయంగా హైదరాబాద్ మెట్రో పరుగులు తీయటం ఖాయమంటున్నారు.
మహానగరంలో మొత్తం 69 కిలోమీటర్ల మార్గాన్ని అందుబాటులోకి తీసుకు రావటం తెలిసిందే. తాజాగా నెలకొన్న పరిస్థితుల్లో తొలుత మాత్రం అన్ని స్టేషన్లలో మెట్రో ఆగే అవకాశం లేదంటున్నారు. రద్దీ తక్కువగా ఉండే స్టేషన్లను కొద్దిరోజులు నిలిపివేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
విడి రోజుల్లో మూడు బోగీలు ఉండే మెట్రోలో వెయ్యి మంది వరకూ ప్రయాణించే వీలుంది. అందుకు బదులుగా.. తొలినాళ్లలో 500 మందితో నడిపించాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విధానాన్ని అమలు చేసేందుకు వీలుగా.. బోగీల్లో తెల్లటి సర్కిల్స్ గీసినట్లు తెలుస్తోంది. ప్రయాణికులు అందులో నిలుచునేలా జాగ్రత్తలు తీసుకోనున్నారు.
అన్ లాక్ 1.0లో భాగంగా హైదరాబాద్ మెట్రో ప్రయాణికులు సరికొత్త అనుభవాన్ని ఇచ్చేలా కొన్ని మార్పులు చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్లు.. మెట్రో స్టేషన్లలో ఎస్కలేటర్లు.. లిప్టుల బటన్లు చేతితో కాకుండా.. కాలివేళ్లతో టచ్ చేసేలా కొత్త టెక్నాలజీని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సాంకేతికతను చెన్నై మెట్రోలో అమలు చేస్తున్నారు. అంతేకాదు.. బోగీలో ప్రయాణికులు పట్టుకునే హ్యాండిల్స్ ను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయనున్నారు. మొత్తంగా హైదరాబాద్ మెట్రో ప్రయాణం.. పూర్తిగా సురక్షితం అన్న భావన కలిగించేలా ఏర్పాట్లు ఉంటాయని చెబుతున్నారు.