Begin typing your search above and press return to search.
మెట్రో పరుగుకు ముహుర్తం డిసైడ్
By: Tupaki Desk | 20 Feb 2016 11:34 AM ISTఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెట్రోకు సంబంధించిన ఒక తీపికబురు బయటకు రానుంది. హైదరాబాదీయుల ట్రాఫిక్ సమస్యలకు చెక్ చెప్పే మెట్రో పరుగులు తీసేందుకు ముహుర్తం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. రెండు.. మూడు రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మెట్రోకు సంబంధించి రెండు చోట్ల జూన్ నుంచి ప్రారంభిస్తామని వెల్లడించారు.
ఈ రెండు రూట్లలో ఒకటి ఉప్పల్ - మెట్టుగూడ అయితే.. రెండోది మియాపూర్ –ఎస్ ఆర్ నగర్. జూన్ లో ప్రారంభమయ్యే మెట్రోను ఏ తేదీ నుంచి పట్టాలెక్కిస్తారన్న అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతిష్ఠాత్మకమైన మెట్రోను తెలంగాణ రాష్ట్ర విభజన రోజైన జూన్ 2 తేదీన స్టార్ట్ చేయాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.
దీనికి ఎల్ అండ్ టీ సుముఖంగా ఉంది. దీంతో.. జూన్ 2న హైదరాబాదీయులకు మెట్రో అందుబాటులోకి రానుంది. నగర ప్రజలకు ఇంతకంటే మంచి న్యూస్ ఇంకేం ఉంటుంది. కాకుంటే.. మిగిలిన మార్గాల్లో కూడా మెట్రో పనులు వేగంగా పూర్తి అయితే మరింత బాగుంటుంది.