Begin typing your search above and press return to search.

స్వ‌చ్ఛ భార‌త్‌ లో హైద‌రాబాద్ టాప్‌

By:  Tupaki Desk   |   17 Nov 2016 3:42 PM GMT
స్వ‌చ్ఛ భార‌త్‌ లో హైద‌రాబాద్ టాప్‌
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ మానస పుత్రిక అయిన స్వచ్ఛ భారత్ విష‌యంలోఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ టాప్‌ లో నిలిచింది. స్వ‌చ్ఛ భార‌త్ అవగాహన ప్రచారంలో ముందున్న పట్టణాలు - నగరాల జాబితాను కేంద్రపట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. జాబితాలో ఉన్న మొదటి పది స్థానాలను కేంద్రపట్టణాభివృద్ధి శాఖ ప్రకటించగా... అలీగఢ్ మొదటి స్థానంలో నిలిచింది. హైదరాబాద్ మూడవ స్థానం - తిరుపతి 8వ స్థానంలో నిలిచాయి. రెండో స్థానంలో వసాయ్-విరార్ (మహారాష్ట్ర) - నాలుగో స్థానం-గురుగ్రామ్ (హర్యానా) - ఐదో స్థానం-చండీగఢ్ (హర్యానా) - ఆరోస్థానం-మధురై (తమిళనాడు) - ఏడో స్థానం-వడోదర - రాజ్‌కోట్ (గుజరాత్) - తొమ్మిదో స్థానం లో మైసూరు (కర్ణాటక) నిలిచాయి.

స్వ‌చ్ఛ భార‌త్‌ ను కేంద్ర ప్ర‌భుత్వం ప్రారంభించిన స‌మ‌యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం సైతం స్వ‌చ్ఛ హైద‌రాబాద్ నిర్వ‌హించింది. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో గత మే 16నుండి 20వ తేది వరకు స్వచ్ఛ్‌ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేప‌డుతూ జంటనగరాలను 400 భాగాలుగా విడదీసింది. స్వచ్ఛ హైదరాబాద్‌ లో భాగంగా చెత్త తొలగింపునకు ట్రాలీలు - బుట్టలు పంపిణీ చేశారు. 200 మార్కెట్ల నిర్మాణాలకు ఆదేశాలిచ్చారు. సిటీకి నాలుగువైపులా డంపింగ్ యార్డులను ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. గవర్నర్‌ మొదలుకొని ముఖ్యమంత్రి - మంత్రులు - రాష్ట్ర ప్రదానకార్యదర్శితో పాటు ఉన్నాతాధికారులందరూ గల్లీ గల్లీ తిరిగారు. టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యేట్లు పబ్లిసిటీ చేశారు. వీరే కాకుండా మొత్తం 37వేల మంది స్వచ్ఛ్ హైదరాబాద్‌ లో పాల్గొన్నారు. ఈ నేప‌థ్యంలోనే టాప్ 3 గుర్తింపు ద‌క్కిన‌ట్లు గ్రేట‌ర్ వ‌ర్గాలు భావిస్తున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/