Begin typing your search above and press return to search.
అరేయ్ మందుబాబులు జర జాగ్రత్త .. ఆ టెస్టులకి సిద్ధమైన పోలీసులు !
By: Tupaki Desk | 29 Sep 2020 12:30 AM GMTకరోనా కారణంగా మూతబడ్డ పబ్స్ , బార్లు తిరిగి తెరుచుకున్నాయి. దీనితో మందుబాబులు కూడా వీకెండ్స్ లో మద్యం మత్తులో మునిగితేలడానికి సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా మందుబాబులకి చుక్కలు చూపించడానికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయడానికి సిద్ధమౌతున్నారు. మార్చి నెలలో ఆపేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ ను మళ్లీ హైదరాబాద్ పోలీస్ శాఖ ప్రారంభించనుంది. మార్చిలో కరోనాతో అన్ని మూతబడటంతో డ్రంక్ అండ్ డ్రైవ్‌లు కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో పోలీసులు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్స్ ను నిలిపివేశారు. తాజాగా మందుబాబులకు గుడ్ న్యూస్ చెబుతూ పబ్బులు, బార్లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో పోలీసులు మళ్లీ తమ పనిలో బిజీ కాబోతున్నారు.
మే నెలలో మద్యం షాపులు తెరిచేందుకు అనుమతి ఇవ్వడంతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ప్రారంభం అయ్యాయి కానీ , పెద్ద ఎత్తున చేయలేదు. కానీ ఈ సారి మాత్రం పూర్తి స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు పోలీసులు. పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా భౌతిక దూరం పాటించేలా ప్లాన్ వేస్తున్నారు. అలాగే కరోనా గైడ్ లైన్స్ కూడా ఫాలో అవుతూనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించాలని భావిస్తున్నారు. పక్క రాష్ట్రాలు డ్రంక్ అండ్ డ్రైవ్ ను ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఎలా నిర్వహిస్తున్నారనేదానిపై కూడా హైదరాబాద్ పోలీస్ శాఖ స్టడీ చేయనున్నట్లు సమాచారం. పక్క రాష్ట్రాల వారు ఏ తరహా జాగ్రత్తలు తీసుకుంటున్నారో ప్రస్తుతం స్టడీ చేస్తున్నట్లు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ అనిల్ కుమార్ చెప్పారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ లకు చెక్ పాయింట్ లను కూడా సిద్ధం చేస్తున్నారు హైదరాబాదు పోలీసులు. ఇక పెద్దగా ఉండే రహదారులపై ఎక్కువగా పోలీసులను మోహరించవచ్చనే ఆలోచనతో అలాంటి రహదారులను హైదరాబాద్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ పాయింట్స్ గా ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ సందర్భంగా పీపీఈ కిట్లు పోలీసులు తప్పకుండా ధరించాల్సి ఉంటుంది. ఇదంతా ఇలా ఉంటే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో వినియోగించే ప్రధాన పరికరం బ్రీత్ అనలైజర్‌పై ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఏదేమైనా పోలీసులు రంగంలోకి దిగుతున్నారు కాబట్టి మందుబాబులు కొంచెం కంట్రోల్ లో ఇంటికి చేరితే మంచిది. లేకపోతే పోలీసుల చేతుల్లో చిక్కి బలైపోతారు. జర జాగ్రత్త .. మందుబాబులు.