Begin typing your search above and press return to search.

కాల్‌ మనీ ఆగడాలపై ఉక్కుపాదం మోపిన హైదరాబాద్ పోలీసులు

By:  Tupaki Desk   |   23 Dec 2020 8:01 AM GMT
కాల్‌ మనీ ఆగడాలపై ఉక్కుపాదం మోపిన హైదరాబాద్ పోలీసులు
X
కాల్‌ మనీ ఆగడాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఝులిపిస్తున్నారు. 700 మందికిపైగా ఉద్యోగులపై 41A CRPC కింద కేసు నమోదు చేశారు. ఆన్‌ లైన్‌ కాల్‌ మనీ వెనుక చైనా ముఠాలు ఉన్నట్లు వెల్లడైంది. హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీసులు మొత్తం 17మందిని అరెస్టు చేశారు. ఢిల్లీలో ఐదుగురు, హైదరాబాద్ ‌లో ఆరుగురు నిందితులను అరెస్టు చేశామని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు.

ఇలాఉండగా, హైదరాబాద్‌, ఢిల్లీ, గురుగ్రామ్‌తో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో నాలుగైదు నెలల క్రితం పక్కా ప్రణాళికతో రుణాలిచ్చే యాప్‌ ల సేవలు మొదలయ్యాయి. నగరంలో బేగంపేట, పంజాగుట్ట ప్రాంతాల్లో మూడు కాల్‌సెంటర్లు నిర్వహిస్తున్నారు. ఇక్కడ 600 మంది టెలీకాలర్స్‌ 30 రుణ యాప్ ‌ల కోసం పని చేస్తున్నారు. గురుగ్రామ్ ‌లో 500 మంది ఉద్యోగులున్నారు. ఇండోనేషియా, చైనా, తదితర దేశాలకు చెందిన సంస్థల ద్వారా యాప్‌లను నిర్వహిస్తున్నారు. సీసీఎస్‌ పోలీసులు ఢిల్లీ, హైదరాబాద్‌లలో చేపట్టిన దాడుల్లో 11మందిని అరెస్ట్‌ చేశారు.

కాల్‌సెంటర్ల నుంచి 700 ల్యాప్ ‌ట్యాప్‌ లు, సర్వర్లు, కంప్యూటర్లు, 10 బ్యాంకు ఖాతా పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. భారతీయులను సంస్థల డైరెక్టర్లుగా నియమించి తెర వెనుక నుంచి చైనా దేశస్తులు కార్యకలాపాలు సాగిస్తుండవచ్చని పోలీస్‌ కమిషనర్‌ వెల్లడించారు. సైబరాబాద్‌ పోలీసులు కూడా ఈ కేసులో ప్రధాన నిందితుడు సహా ఇద్దరు డైరెక్టర్లు, మరో ముగ్గురు ఉద్యోగులను అరెస్టు చేశారు. రెండు సంస్థలకు సంబంధించిన 18 ఖాతాలను క్లోజ్‌ చేశారు. కాల్ సెంటర్ల పనితీరుపై వీరిని విచారించగా…. టెలీ కాలర్లను S1, S2, S3 లుగా విభజించి పనులు అప్పగిస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. సకాలంలో లోన్ రికవరీ చేయించిన టెలీ కాలర్లకు జీతంతో పాటు అదనంగా 10 వేల రూపాయల నుంచి 20 వేల రూపాయల వరకు ఇన్సెంటివ్‌లు అందిస్తున్న అంశం పోలీసు విచారణలో వెలుగు చూసింది.