Begin typing your search above and press return to search.
వైరస్ విజయులు: బాధిత పోలీసులకు సత్కారం
By: Tupaki Desk | 15 July 2020 1:30 AM GMTవైరస్ బారిన పడి విజయవంతంగా చికిత్స పొంది కోలుకుని విధుల్లో చేరిన పోలీసులను ఆ శాఖ ఉన్నతాధికారులు అభినందించి సత్కరించారు. వైరస్ ను జయించి తిరిగి విధుల్లో చేరిన ట్రాఫిక్ సిబ్బందిని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అభినందించారు. ఆయా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో విధులు నిర్వహిస్తున్న ముగ్గురు ఎస్సైలు, ముగ్గురు ఏఎస్సైలు, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, 8 మంది కానిస్టేబుళ్లు, 16 మంది హోంగార్డులు వైరస్ సోకింది. అయినా వారు భయాందోళన చెందకుండా కోలుకున్నారు. ప్రజాసేవలో ఉన్న వారు వైరస్ బారిన పడడం అందరీలో ఆందోళన రేపింది.
ఈ సందర్భంగా వారికి కరోనా కాంకరర్స్ పేరిట ఒక సర్టిఫికెట్, ఒక బహుమతిని పోలీస్ శాఖ ప్రదానం చేసింది. హైదరాబాద్ నాంపల్లి రెడ్‌రోజ్ ఫంక్షన్‌హాల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. విధి నిర్వహణలో బిజీగా ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సందర్భాల్లో వైరస్ బారిన పడే అవకాశం ఉందని కమిషనర్ తెలిపారు. అయినా వైరస్ ను ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా కోలుకుని విధులకు హాజరవుతున్నారని అభినందించారు. మీరే రియల్ హీరోస్ అని, వారికి సెల్యూట్ చేస్తున్నానని కమిషనర్ ప్రకటించారు. ఈ సందర్భంగా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు.. సూచనలు చేశారు.