Begin typing your search above and press return to search.
కరోనా బాధితులకు ప్లాస్మా దానం చేయండి : సీపీ సజ్జనార్ !
By: Tupaki Desk | 18 July 2020 5:30 PM GMTదేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకి దేశంలో నమోదు అయ్యే కరోనా మహమ్మారి కేసులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే దేశంలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటింది. అలాగే మరణాల సంఖ్య కూడా భారీగా పెరుగుతుంది. కరోనాకి సరైన వ్యాక్సిన్ లేకపోవడంతో రోజురోజుకి కరోనా భారిన పడే వారి సంఖ్య పెరిగిపోతుంది. ప్రస్తుతం కరోనాకి ట్రీట్మెంట్ అంటే ప్లాస్మా థెరపీనే.. ఈ ప్లాస్మా థెరపీ వల్ల చాలామంది కరోనా నుండి కోలుకున్నారు. ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ బారిన పడి . చికిత్స తీసుకోని కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్ కోరారు.
అయన మాట్లాడుతూ ... కరోనా భారిన పడి కోలుకున్న ప్రతి ఒక్కరికి సైబరాబాద్ పోలీస్ తరుపున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా మంది కరోనా తో ఆస్పతుల్లో అడ్మిట్ అవుతున్నారని, కరోనా వైరస్ రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతుందని అన్నారు. కరోనా నుండి కోలుకున్న వారిలో సుమారు 500 మి.లీ ప్లాస్మా ఇద్దరు కరోనావైరస్ రోగుల ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది అని తెలిపారు. కరోనావైరస్ నుండి కోలుకున్న ముగ్గురు పోలీసులు రోగుల ప్రాణాలను కాపాడే ప్లాస్మాను దానం చేయడానికి ముందుకు వచ్చారని ఆయన అన్నారు. కరోనా భారిన పడి పూర్తిగా కరోనా నుండి కోలుకున్నవారు .. ప్లాస్మా దానం చేయాలని అనుకుంటే .. 9490617440 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని సీపీ తెలిపారు