Begin typing your search above and press return to search.
మార్చి 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే జైలుకే?
By: Tupaki Desk | 27 Feb 2016 8:59 AM GMTరోజురోజుకి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఇందుకోసం కఠిన శిక్షలు అమలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం మార్చి 1 నుంచి కొత్త శిక్షలు అమలు చేయాలని భావిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో అమలు చేసే తాజా నిబంధనలు.. ఇష్టారాజ్యంగా వ్యవహరించే వారికి చుక్కలు చూపించటం ఖాయం. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపటం నుంచి హెల్మెట్ లేకుండా వాహనం నడిపే వరకూ కఠిన శిక్షలు అమలు చేయనున్నారు. ఇందుకోసం ట్రాఫిక్ పోలీసు యంత్రాంగం సన్నద్ధమైంది.
మార్చి 1 నుంచి అమలయ్యే నిబంధనలు చూస్తే..
డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే..?
= డ్రైవింగ్ లైసెన్స్ లేదని తనిఖీల్లో తేలితే ఛార్జ్ షీట్ బుక్ చేస్తారు. మొదటిసారి పట్టుబడితే ఒక రోజు జైలుశిక్ష.. రెండోసారి పట్టుబడితే రెండు రోజులు జైలుశిక్ష.. మూడోసారి పట్టుబడితే వారం రోజులు జైలుశిక్ష పడనుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తి వాహనాన్ని నడిపిన వ్యక్తితో పాటు.. సదరు వాహనం ఆ వ్యక్తిది కాకుండా మరొకరిదైతే.. వాహన యజమానిపైన కూడా కేసులు నమోదు చేస్తారు.
హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే..?
= మార్చి 1 నుంచి హైదరాబాద్ సిటీలో హెల్మెట్ లేకుండా వాహనాన్ని నడపటం కూడా తీవ్రమైన నేరం కింద పరిగణించనున్నారు. వాహనాన్ని నడిపేవారు కచ్ఛితంగా హెల్మెట్ పెట్టుకోవాల్సిందే.
= ఒకవేళ హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే తొలిసారి రూ.100.. రెండోసారి రూ.200.. మూడోసారి రూ.300 జరిమానా విధిస్తారు.
= అదే సమయంలో వాహనం వెనుక ఉన్న వారు హెల్మెట్ వినియోగించకున్నా ఫర్లేదు
అలా దొరికితే..?
= బండి ఒకరి పేరు మీద.. తప్పు చేసేదే మరొకరు అయితే.. తప్పు చేసే వారి మీద చర్యలతో పాటు.. సదరు వాహన యజమాని మీద కూడా చర్యలు ఉండనున్నాయి.
= ఒకవేళ వాహనాన్ని అమ్మేస్తే.. వాహనం ఎవరికైతే అమ్ముతున్నామో వారికి యాజమాన్య హక్కులు బదిలీ అయ్యాయా? లేదా? అన్నది చెక్ చేసుకోవాలి. ఒకవేళ అలా చేసుకోవటంలో తప్పులు దొర్లితే.. దానికి సంబంధించిన బాధ్యత మొత్తం వాహనాన్ని అమ్మిన వారికే. వాహనం అమ్మటం మాత్రమే కాదు.. యాజమాన్య హక్కు బదలాయింపు (ట్రాన్సఫర్) సరిగా జరిగిందా? లేదా? అన్నది చూడటం తప్పనిసరి.