Begin typing your search above and press return to search.

డిసెంబరు 31 రాత్రి.. జాగ్రత్త గురూ!

By:  Tupaki Desk   |   29 Dec 2016 12:20 PM GMT
డిసెంబరు 31 రాత్రి.. జాగ్రత్త గురూ!
X
మాములుగానే శనివారం - పైగా ఇయర్ ఎండింగ్... ఇంక కుర్రకారు సంగతి ప్రత్యేకంగా చేప్పేదేముంది? పైగా హైదరాబాద్ అయితే... మాటల్లేవ్ - మాట్లాడుకోవడాల్లేవ్. డిసెంబరు 31 అర్ధరాత్రి అంటే ఆ పేరున జరిగే సందడి - హడావిడి - హంగామా అంతా ఇంతాకాదు. వాటన్నింటిలో కీలక పాత్ర పోషించేది గరిష్టంగా మద్యమే! న్యూ ఇయర్ కార్నివాల్ అంటూ ఇప్పటికే భాగ్యనగరం మొత్తం ఫ్లెక్సీలతో నిండిపోయింది.. ఏ హోటల్ లో పార్టీకి హాజరవ్వాలో తెలియక జనాలు లాటరీలు తీసుకోవాల్సిన పరిస్థితి. జనాల హడావిడి, పార్టీ హౌసెస్ ప్లానింగ్ ఇలా ఉంటే తాజాగా ఒక విషయం చెప్పారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.

ఇయర్ ఎండింగ్ కదా అని మందుకొట్టి డ్రైవ్ లు - రోడ్లవెంబడి కేకలతో హార్న్ కొడుతూ తిరగాలనుకున్నారో తాటతీస్తామని చెబుతున్నారు హైదరబాద్ పోలీసులు. అర్ధరాత్రి వరకూ ఫ్రెండ్స్ తో మందుపార్టీల్లో గడిపి అనంతరం ఏ తెల్లవారుజామునో ఇంటికి బయలుదేరితే డ్రంక్ అండ్ డ్రైవ్ ఏముంటుందిలే అని పొరపాటున కూడా అనుకోవద్దు! ఎందుకంటే... హైదరాబాద్‌లో డిసెంబర్‌ 31న రాత్రి 10 గంటల నుంచి జనవరి 1న ఉదయం 5 గంటల వరకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నిర్వహించబోతున్నారు సిటీ ట్రాఫిక్ పోలీసుల. ఆ ఎప్పుడూ ఉండేదే కదా అని లైట్ తీసుకోవద్దు... వీటికోసం ప్రత్యేకంగా 100కు పైగా పోలీసు బృందాలు రెడీఅవుతున్నాయి. మద్యం తాగి డ్రైవ్ చేస్తే.. వారిని అరెస్ట్ చేయడమే కాకుండా, ఆ వాహనాన్ని కూడా సీజ్‌ చేస్తామని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ డీసీపీ రంగనాథ్‌ చెబుతున్నారు.

కాబట్టి... 31 రాత్రి తాగి వాహనాలను డ్రైవ్ చేస్తూ ఎలాంటి చిత్రవిచిత్రాలు చేసినా అడ్డంగా దొరికిపోవడం ఖాయమన్నమాట!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/