Begin typing your search above and press return to search.

డ్రంక్ అండ్ డ్రైవ్ లో స‌రికొత్త సిత్రం!

By:  Tupaki Desk   |   27 Aug 2018 4:18 AM GMT
డ్రంక్ అండ్ డ్రైవ్ లో స‌రికొత్త సిత్రం!
X
హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు గ‌డిచిన కొంత కాలంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ప‌రీక్ష‌లు జ‌ర‌ప‌టం.. తాగిన వారిపై కేసులు న‌మోదు చేయ‌టం.. వారి వాహ‌నాల్ని సీజ్ చేయ‌టం తెలిసిందే. ఇలా ప‌ట్టుబ‌డిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవ‌టం.. కౌన్సెలింగ్ చేయ‌టం చూస్తూనే ఉన్నాం. సామాన్యుల మొద‌లు సెల‌బ్రిటీలు.. ప్ర‌ముఖుల సంతానం వ‌ర‌కూ చాలామంది ఈ డ్రంక్ అండ్ డ్రైవ్‌ లో ఇబ్బందులు ఎదుర్కొన్న వారే.

ఇదిలా ఉండ‌గా.. ఇప్ప‌టివ‌ర‌కూ డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎప్పుడూ ఎదురుకాని సిత్ర‌మైన ప‌రిస్థితిని సుల్తాన్ బ‌జార్ ట్రాఫిక్ పోలీసులు ఎదుర్కొంటున్నారు. శ‌నివారం రాత్రి కాచిగూడ‌లోని ఐనాక్స్ వ‌ద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు చేప‌ట్టారు. రాత్రి తొమ్మిది గంట‌ల ప్రాంతంలో ఇన్నోవాలో వెళుతున్న 21 ఏళ్ల హాజిపుర వాసి స‌య్య‌ద్ జ‌హిరుద్దీన్ ఖాద్రీ కి ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. బ్రీత్ అన‌లైజ‌ర్ ద్వారా చేసిన టెస్టులో అల్క‌హాల్ కౌంట్ 43గా చూపించింది. రూల్స్ ప్ర‌కారం 35 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే.. వారిపై చ‌ర్య‌లు చేప‌డ‌తారు.

ఖాద్రీపై చ‌ర్య‌ల‌కు పోలీసులు సిద్ధం కాగా.. అత‌గాడి వాద‌న మాత్రం మ‌రోలా ఉంది. అస‌లు తాను తాగ‌లేద‌ని.. దేనికైనా రెఢీ అంటూ అత‌డు వాగ్వాదానికి దిగాడు. ఇదిలాఉంటే.. తాము జ‌రిపిన ప‌రీక్ష‌ల‌పై సందేహాలు ఉంటే కోర్టులో స‌వాలు చేయొచ్చ‌న్న పోలీసుల మాట‌తో విబేదించిన అత‌డు.. నేరుగా సుల్తాన్ బ‌జార్ లా అండ్ ఆర్డ‌ర్ పోలీసు విభాగాన్ని ఆశ్ర‌యించి ట్రాఫిక్ పోలీసుల తీరుపై కంప్లైంట్ ఇచ్చాడు. త‌న‌కు ర‌క్త ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని కోరాడు.

దీంతో.. ఒక కానిస్టేబుల్ ను ఇచ్చి.. అత‌డికి ప‌రీక్ష‌లు జ‌ర‌ప‌గా.. మ‌ద్యం సేవించ‌లేద‌ని వైద్యులు పేర్కొన్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసుల తీరుపై ప‌లు సందేహాలు వ్య‌క్తం కావ‌టంతో పాటు.. విమ‌ర్శ‌లు రావ‌టం మొద‌ల‌య్యాయి. దీనిపై ట్రాఫిక్ పోలీసుల వాద‌న మ‌రోలా ఉంది.

ఉస్మానియా ఆసుప‌త్రికి వెళ్లిన ఖాద్రికి అక్క‌డి వైద్యులు ర‌క్త ప‌రీక్ష‌ల కిట్ లేక‌పోవ‌టంతో టెస్టులు చేయ‌లేద‌ని.. న‌డ‌క‌.. క‌ళ్ల‌ను.. ముఖ క‌వ‌ళిక‌ల్ని చూడ‌టం ద్వారా అత‌డు తాగ‌లేద‌ని తేల్చార‌ని చెబుతున్నారు. కోర్టులో స‌వాలు చేస్తే.. అందుకు త‌గ్గ‌ట్లు తాము నివేదిక స‌మ‌ర్పిస్తామ‌ని సుల్తాన్ బ‌జార్ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. ఇటీవ‌ల కాలంలో ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడూ ఏ ట్రాఫిక్ పోలీసులు ఎదుర్కొన్న‌ది లేదు. దీంతో.. ఈ వ్య‌వ‌హారం ఏమ‌వుతుంద‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.