Begin typing your search above and press return to search.
స్పీకర్ సతీమణి ప్రయాణిస్తున్న కారు స్టిక్కర్ పీకేసిన హైదరాబాద్ పోలీసులు
By: Tupaki Desk | 30 March 2022 12:45 PM GMTఅనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరిస్తున్న పోచారం శ్రీనివాసరెడ్డి సతీమణి ప్రయాణిస్తున్న వాహనానికి ఉన్న స్పీకర్ స్టిక్కర్ ను పోలీసులు తొలగించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇటీవల కాలంలో వాహనాల మీద ఉన్న వివిధ హోదాల్ని తెలియజేసే స్టిక్కర్లను తొలగించే ప్రత్యేక డ్రైవ్ ను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. మంగళవారం స్పీకర్ సతీమణి ప్రయాణిస్తున్న వాహనానికి స్పీకర్ స్టిక్కర్ ఉంది. తనిఖీల్లో భాగంగా వాహనాన్ని ఆపిన పోలీసులు.. కారు మీద ఉన్న స్పీకర్ స్టిక్కర్ ను తొలగించేశారు.
పోలీసులు తీరుతో అవాక్కుఅయిన కారు డ్రైవర్.. తనకు ఎదురైన అనుభవాన్ని అసెంబ్లీ అధికారులకు సమాచారం అందించినట్లుగా తెలుస్తోంది. దీనిపై సీరియస్ అయిన వారు.. జరిగిన పరిణామానికి సంబంధించిన వివరాల్ని సేకరిస్తున్నారు. పోలీసుల తీరును తప్పు పడుతున్నట్లుగా తెలుస్తోంది. వాహనాలపై పోలీసుల.. అడ్వొకేట్.. ప్రెస్ ఇలా పలు హోదాలను సూచించే స్టిక్కర్లను తొలగించాలని పేర్కొంటూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక నోటిఫికేషన్ ను జారీ చేశారు.
సదరు నోటిఫికేషన్ లో అలహాబాద్ హైకోర్టు.. మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు.. పలు కోర్టు తీర్పుల్ని పేర్కొంటూ మోటారు వాహన చట్టంలోని సెక్షన్ 177.. మోటారు వాహన నిబంధనల్లోని రూల్ 50 ప్రకారం మోదాల్ని తెలిపే స్టిక్కర్లను వాహనాలకు అంటించటం ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో గడిచిన కొద్ది రోజులుగా పలు వాహనాల్ని అడ్డుకుంటున్న పోలీసులు.. వాహనాల మీద ఉన్న స్టిక్కర్లను తొలగించటమే కాదు.. భారీగా ఫైన్లు వేస్తున్నారు. పలువురు మీడియా ప్రతినిధుల వాహనాల మీద ఉన్న ప్రెస్ స్టిక్కర్లను తొలగించి రూ.700చొప్పున ఫైన్ వేస్తున్న వైనంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ సందర్భంగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల తీరును తీవ్రంగా తప్పు పడుతున్నారు. హైదరాబాద్ పోలీసులు ప్రస్తావిస్తున్న కోర్టు తీర్పులు.. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు.. సిబ్బందికి మాత్రమే వర్తిస్తాయని చెబుతున్నారు. అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్ లోనూ ప్రైవేటు.. ప్రభుత్వఉద్యోగులు తమ హోదాను సూచించే బోర్డులు.. ప్లేట్లు బిగించకూడదని చెబుతున్నారు.
అంతేకాదు.. మోటారు వాహనాల చట్టం ప్రకారం.. నేమ్ ప్లేట్ కు సంబంధించి ఏదైనా ఉల్లంఘన జరిగితే.. రూ.100 వరకు జరిమానా విధించాలే తప్పించి.. హైదరాబాద్ పోలీసుల మాదిరి రూ.700చొప్పున వసూలు చేయటం ఏ మాత్రం సరికాదంటున్నారు. పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తెలంగాణ స్పీకర్ సతీమణి ప్రయాణిస్తున్న కారుకు ఉన్న స్పీకర్ స్టిక్కర్ తొలగించిన వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.