Begin typing your search above and press return to search.
హైదరాబాద్ పోలీస్ పుష్ప డైలాగ్
By: Tupaki Desk | 14 Jan 2022 3:31 AM GMTఅల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమాలోని ప్రతి ఒక్క పాట మరియు డైలాగ్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు మరియు సాధారణ ప్రేక్షకులు కూడా ఇప్పుడు తగ్గేదే లేదు అంటూ తెగ సందడి చేస్తున్నారు. హే బిడ్డ ఇది నా అడ్డ అంటూ చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా పుష్ప సినిమా డైలాగ్స్ వాడేస్తున్నారు. ఇలాంటి వైరల్ డైలాగ్స్ ను మరియు పాటలను ఫోటోలను హైదరాబాద్ పోలీసులు ఖచ్చితంగా ఉపయోగిస్తారని మనందరికీ తెలిసిందే.
గతంలో పలు సార్లు పలు ఫోటోలను మరియు వీడియోలను సోషల్ మీడియాలో ట్రాఫిక్ అవేర్నెస్ మరియు కరోనా వ్యాధి నివారణకు గాను వినియోగించిన విషయం తెలిసిందే. తాజాగా పుష్ప సినిమాలోని తగ్గేదెలా డైలాగ్ను హైదరాబాద్ పోలీసులు ఉపయోగించారు. మాస్కు పెట్టుకునే విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా హైదరాబాద్ పోలీసులు అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రకు మాస్క్ పెట్టి ఈ డైలాగ్ ని షేర్ చేయడం జరిగింది. హైదరాబాద్ పోలీస్ సోషల్ మీడియా వింగ్ భిన్నమైన ప్రచారం కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పండుగ సందర్భంగా చాలా మంది మాస్కులు పెట్టుకోకుండా అని తెగ తిరిగేస్తున్నారు, వారందరికీ ఇదే పోలీసువారి హెచ్చరిక అన్నట్లుగా తగ్గేదెలే డైలాగ్ ఉంది.
మాస్క్ లు పెట్టకుంటే పనిష్మెంట్ ఖాయం అన్నట్లుగా పోలీసు వారు ఈ పోస్టుతో హెచ్చరిస్తున్నారు అని అర్థం అవుతుంది. మొత్తానికి సోషల్ మీడియాలో హైదరాబాద్ పోలీసులు పుష్ప సినిమా డైలాగ్ ని వినియోగించడం ద్వారా ఆ సినిమా పాపులారిటీ మరింతగా పెరిగిందని నెటిజన్ కామెంట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లోనే కాకుండా 2021లో విడుదలైన సినిమాల్లో అతి పెద్ద సినిమాగా పుష్ప నిలిచింది. బాలీవుడ్లో 80 కోట్ల రూపాయలను సినిమా రాబట్టింది. మొత్తంగా మూడు వందల కోట్లకు పైగానే ఈ సినిమా వసూళ్లు సాధించినట్లు గా టాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు. నాన్ బాహుబలి రికార్డ్స్ ను సొంతం చేసుకున్న పుష్ప 1 కు త్వరలోనే రెండో పార్ట్ ను పట్టా లెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. పుష్ప పార్ట్ 2 ను కూడా ఇదే ఏడాదిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. 2022 డిసెంబర్ లో ఖచ్చితంగా పుష్ప విడుదల చేయాల్సిందే అంటూ అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.