Begin typing your search above and press return to search.
పోలీసుల రూల్స్ ఏంది కేటీఆర్ సార్?
By: Tupaki Desk | 29 Dec 2017 6:02 AM GMTఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూ తెలంగాణ పోలీసుల గురించి తెలంగాణ అధికారపక్షం తరచూ చెబుతూ ఉంటుంది. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలిగే పోలీస్ వ్యవస్థే తన స్వప్నంగా సీఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్ లు తరచూ చెబుతూ ఉంటారు. అయితే.. వారి మాటలకు రియాలిటీకి ఏ మాత్రం సంబంధం లేదన్న విషయం తాజాగా వెల్లడవుతోంది.
స్నేహపూర్వక పోలీసింగ్ విధానానికి కొత్త అర్థం చెప్పేలా సిటీ పోలీసులు వ్యవహరిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లోకి రావాలంటే చెప్పులు బయటే విడిచి పెట్టి రావాలంటూ ఒక పోలీస్ స్టేషన్ ముందు బోర్డు పెట్టిన వైనం ఆసక్తికర చర్చను రేపితే.. తాజాగా మరో పోలీస్ స్టేషన్లో చిత్రమైన ఆదేశాల్ని జారీ చేశారు.
సాంకేతికతను ఉపయోగించుకుంటూ నేరాల్ని అదుపులోకి తెస్తున్నామంటూ పోలీస్ కమిషనర్ మాటలు చెప్పిన గంటల వ్యవధిలోనే కొత్త రూల్ పెట్టి మరీ షాకిచ్చారు. పోలీస్ స్టేషన్ లోపలకు వచ్చే వారు.. తమ సెల్ ఫోన్లను స్విఛాప్ చేసి లోపలకు రావాలంటూ రూల్ పెట్టటం విశేషం.
ఈ మధ్యన తన్నూ అనే రౌడీషీటర్ ను అక్రమంగా పోలీసులు నిర్బంధించి కొడుతున్న వైనాన్ని ఫోన్లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే కాదు.. షార్ట్ ఫిలిం డైరెక్టర్ యోగిని అడ్డగోలుగా కొడుతున్న వీడియో సైతం బయటకు వచ్చి సంచలనం సృష్టించింది. ఇలా మొబైల్ ఫోన్లతో తమకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురువుతున్న వేళ.. అలాంటి వాటిని అధిగమించేందుకు వీలుగా సెల్ ఫోన్లను స్విచ్ఛాప్ చేసి పోలీస్ స్టేషన్ లోపలకు రావాల్సిందిగా సిటీలోని కొన్ని పోలీస్ స్టేషన్లలో బోర్డులు ఏర్పాటు చేయటాన్ని పలువురు తప్ప పడుతున్నారు.