Begin typing your search above and press return to search.
వామ్మో.. బీజేపీ డబ్బు ఆ స్థాయిలో పట్టుబడిందా!
By: Tupaki Desk | 8 April 2019 4:46 PM GMTహైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన భారీ క్యాష్ డంప్ దొరికిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి. అది సూటిగా బ్యాంకు నుంచి డ్రా అయ్యి నేతలకు చేరే ముందే టాస్క్ ఫోర్స్ పోలీసులకు పట్టుబడినట్టుగా సమాచారం. ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయల భారీ మొత్తం హైదరాబాద్ లో పోలీసులకు దొరికింది. ఆ భారీ మొత్తాన్ని సీజ్ చేసిన పోలీసులు.. దీనిపై విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఎన్నికల పోలింగ్ కు సమయం ఆసన్నం అవుతున్న నేపథ్యంలో మోడల్ కోడ్ ప్రకారం అంత డబ్బును బ్యాంకు నుంచి డ్రా చేయడం కూడా నేరమే. ఈ సమయంలో బ్యాంకులకే కొన్ని నియమాలున్నాయి. ఎడాపెడా డబ్బులు డ్రా చేసి ఇవ్వడానికి లేదు. ఇలాంటి సమయంలో బీజేపీ వాళ్ల కోసం నారాయణ్ గూడా లోని ఇండియన్ బ్యాంకు వారు ఏకంగా ఎనిమిది కోట్ల రూపాయల మొత్తాన్ని డ్రా చేసి ఇవ్వడం వివాదంగా మారుతూ ఉంది.
బీజేపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు లక్ష్మణ్ రాసిచ్చిన సెల్ఫ్ చెక్ ద్వారా ఎనిమిది కోట్ల రూపాయలను డ్రా చేశారనే విషయం సంచలనంగా మారింది. స్వయంగా బీజేపీ ఒక రాష్ట్ర విభాగం అధ్యక్షుడు ఈ చెక్కును రాసిచ్చి డబ్బులు డ్రా చేయమన్నాడట. అందులో రెండు కోట్ల రూపాయలను ఒక కారులో, మిగతా ఆరు కోట్ల రూపాయలను మరో వాహనంలో తరలిస్తూ ఉండగా పోలీసులు పట్టుకున్నారు.
ఈ విషయంలో కేసులు నమోదు చేయడానికి పోలీసులు సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ స్థాయిలో డబ్బు డ్రా చేయించి ఇచ్చిన బ్యాంకు మేనేజర్ పై కూడా కేసులు తప్పవని తెలుస్తోంది. మొత్తానికి పోలింగ్ వేళ బీజేపీకి సంబంధించిన ఇంత డబ్బు పట్టు బడటం ఒకింత సంచలనంగానే మారుతోంది. దీనిపై కమలనాథులు ఏమంటారో!