Begin typing your search above and press return to search.
కెమేరా కన్ను ‘హెల్మెట్’ను పట్టేస్తాయ్ బాస్
By: Tupaki Desk | 4 March 2016 6:26 AM GMTరోడ్డు ప్రమాదాల్ని తగ్గించేందుకు.. ప్రమాదాల సందర్భంగా భారీ నష్టం జరగకుండా ఉండేందుకు వీలుగా తెలంగాణ పోలీసు శాఖ కఠిన నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే. ఇందులో భాగంగా హెల్మెట్ లేని వాహన వినియోగదారులపై భారీగా జరిమానాలు విధించటం మామూలే అయినా.. ఇటీవల జైలుశిక్ష కూడా వెనుకాడమని నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. హెల్మెట్ లేకున్నా.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపినా జైలు ఖాయం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇంత కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా.. రోడ్ల మీద హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య భారీగానే కనిపిస్తోంది. తమను పోలీసులు పట్టుకోవటం లేదన్న భావనలో పలువురు వాహనదారులు ఉంటున్నారు. అయితే.. అలా అనుకుంటున్న వారంతా తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే.. పోలీసులు వాహనాల్ని ఆపకున్నా.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఏర్పాటు చేసిన కెమేరాల్లో కానీ హెల్మెట్ లేకుండా బండి నడుపుతున్నట్లు నమోదు అయితే.. ఇంటికి నేరుగా నోటీసులు పంపుతున్నారు.
ఒకవేళ వాహనాన్ని ఎవరికైనా ఇచ్చిన సమయంలో.. సదరు వ్యక్తి హెల్మెట్ లేకుండా ప్రయాణించినా.. దాని పూర్తి బాధ్యత వాహన యజమానిదే కానుంది. ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేసి పలువురు వాహన యజమానులకు నోటీసులు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించటం లేదన్న భావనతో హెల్మెట్ ధరించాలన్న విషయాన్ని లైట్ తీసుకుంటే అడ్డంగా బుక్ అయినట్లేనని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
మరో వైపు మార్చి 1 నుంచి చేపట్టిన తనిఖీల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేని 350 మందిని కోర్టు వద్ద హాజరుపర్చగా.. వారిలో 64 మందికి కోర్టు సమయం ముగిసే వరకూ నిలుచొని ఉండాల్సిందిగా శిక్ష విధించారు. ఇక.. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వందలాది మందికి భారీగా జరిమానాలు విధించారు. బుద్దిగా డ్రైవింగ్ లైసెన్స్ తెచ్చుకోవటం.. హెల్మెట్ కొనుక్కుంటే పోయే దానికి ఇన్ని తిప్పలు అవసరమా?