Begin typing your search above and press return to search.
పాత నోట్లకు ఓకే అంటున్న హైదరాబాద్ పోలీస్
By: Tupaki Desk | 15 Nov 2016 7:58 AM GMTఇప్పుడున్న పరిస్థితుల్లో పాత నోట్లు తీసుకునే వారు ఉంటారా?.. అది కూడా పోలీసులు పాత నోట్లు తీసుకుంటారా? ఇంతకీ వారెందుకు తీసుకుంటామని చెబుతున్నారన్న సందేహాలు మదిలో మెదలొచ్చు. అన్నింటికి సమాధానం దొరకాలంటే ఈ వార్తను పూర్తిగా చదవాల్సిందే. పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న సంచలన నిర్ణయంతో రూ.500.. రూ.వెయ్యి నోట్లు ఎక్కడివి అక్కడ నిలిచిపోయాయి.
ఇదిలా ఉంటే.. తమ దగ్గర ఉన్న పాత నోట్లను మార్చుకోవటానికి బ్యాంకుల దగ్గర క్యూలు సామాన్యులకు చిరాకు పుట్టిస్తున్నాయి. ఈ తిప్పలు తీరక ముందే మరో కొత్త సమస్య వచ్చి పడింది. మొదట వారంలో అంత సర్దుకుంటుందని భావించినా.. ఇప్పుడు నెల రోజులైనా పడుతుందని కొందరు అంటుంటే.. లేదు రెండు నెలలు పట్టినా ఆశ్చర్యం లేదన్న మాటను చెబుతున్నారు.
పెద్దనోట్లకు సంబంధించిన రచ్చ ఇలా సాగుతుంటే.. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మాత్రం హైదరాబాదీయులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. తమ వాహనాలకు సంబంధించిన పోలీసు చలానాలు ఏమైనా ఉంటే.. వాటిని తాము తీసుకుంటామని.. పాత నోట్లతో పాత జరిమానాలు చెల్లించొచ్చని చెబుతున్నారు. పాత నోట్లు ఉన్న వారు.. బ్యాంకుల చుట్టూ తిరిగి వాటిని మార్చుకునే ప్రయత్నం చేసే కన్నా.. పోలీసుల చలానాలు ఏమైనా పెండింగ్ ఉన్నాయా? అని చెక్ చేసుకొని కట్టేస్తే.. పాత నోట్ల తలనొప్పి కాస్త తగ్గటంతో పాటు.. పెండింగ్ చలానాతో వచ్చే కష్టాల నుంచి తప్పించుకునే వీలు ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఆఫర్ మంచిగానే ఉన్నట్లు కదూ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/