Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో జాబ్ సెక్యూరిటీ అంతంతేనట..

By:  Tupaki Desk   |   16 Jun 2017 6:28 AM GMT
హైదరాబాద్ లో జాబ్ సెక్యూరిటీ అంతంతేనట..
X
ఐటీ సంస్థల్లో ఉద్యోగాలు పోతున్నాయ్.. ఎవరి ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి. ఒక్క ఐటీ ఏంటి.. చాలా రంగాల్లో అదే పరిస్థితి. అయితే.. దేశమంతా ఇలాగే ఉందా..? ఎక్కడెక్కడ ఇలాంటి ధోరణి ఎక్కువగా ఉందనే విషయంలో తాజాగా ఓ సంస్థ సర్వే చేసింది. ఆ సర్వే ప్రకారం జాబ్ సెక్యూరిటీ బాగా తక్కువగా ఉన్న సిటీల్లో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. తెలుగు రాష్ర్టాల రాజధానిదీ దాదాపు అదే పరిస్థితి. ఈ జాబితాలో హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. బెంగుళూరు రెండో స్థానంలో ఉంది.

సంస్థ ఆర్థిక పరిస్థితి బాగులేదని.. ఉద్యోగి పనితీరు బాగులేదని రకరకాల కారణాలు చెప్తూ తొలగిస్తున్నారట. టైర్-1 సిటీలతో పోలిస్తే దేశ రాజధాని ఢిల్లీలో పని చేసే వారికి ఉద్యోగ భద్రత చాలా తక్కువగా ఉందని తేలింది. అహ్మదాబాద్ - బెంగళూరు - చండీగఢ్ - చెన్నై - ఢిల్లీ - హైదరాబాద్ - కోల్ కతా - ముంబయి - పూణెలలో ఈ సర్వే చేశారు. నగరం - సెక్టార్ - ప్రొఫైల్ ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించిన నివేదికల ఆధారంగా ఆశ్చర్యకరమైన విషయాలు సర్వేలో వెల్లడయ్యాయి.

ఉద్యోగ భద్రత తక్కువగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో ఉండగా అహ్మదాబాద్ - ముంబై - చండీగఢ్ - చెన్నై - కోల్ కతా - పుణెలది ఆ తరువాత ప్లేస్. ఉద్యోగ భద్రత లేకపోవడమనేది ఆయా ఇండస్ట్రీల బట్టి కూడా ఉంటోంది. ఇండస్ట్రియల్ మాన్యుఫాక్చరింగ్ - అలైడ్ సెక్టార్స్ లో పని చేసే ఉద్యోగులు తమ ఉద్యోగాలను పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో కన్ స్ట్రక్షన్ అండ్ రియల్ ఎస్టేట్ - బీపీఓ అండ్ ఐటీ రంగాల్లో సేవలందించే సంస్థలు ఉన్నాయి. హెల్త్ కేర్ - టెలికామ్ రంగాల్లో పని చేసే వారు నిర్భయంగా పని చేసుకుంటున్నారట. అక్కడ జాబ్ సెక్యూరిటీ బాగా ఉందని ఈ సర్వే చెప్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/