Begin typing your search above and press return to search.

కరోనా నిబంధనలను బేఖాతరు .. వీడియో వైరల్ - బార్ సీజ్!

By:  Tupaki Desk   |   12 Oct 2020 4:00 PM GMT
కరోనా నిబంధనలను బేఖాతరు .. వీడియో వైరల్ - బార్ సీజ్!
X
కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో పాటు కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా గత కొన్నిరోజుల పాటు బార్లు, పబ్ లు మూత పడిన సంగతి తెలిసిందే. అయితే , ఇటీవలే మళ్లీ బార్లు తెరుచుకోవడంతో మద్యం ప్రియులు మళ్లీ బార్ల బాట పట్టారు. అయితే కరోనా నిబంధనలను బార్ నిర్వాహకులు, బార్లకు వెళుతున్న కస్టమర్లు పాటించాల్సిన అవసరం ఉందని, ఆ బాధ్యత బార్ నిర్వాహకులు తీసుకోవాలని కరోనా నిబంధనలను జారీ చేసిన అధికారులు , ఆ నియమాలు పాటించని ఓ బార్ పై కొరడా ఝుళిపించారు.

కరోనా నియమాలు గాలికి వదిలేసినందుకు రిజైన్ స్కై బార్ ను అధికారులు సీజ్ చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా బార్లను నిర్వహించాల్సి ఉన్నా నిర్వాహకులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, బార్ లో పనిచేసే వెయిటర్ లు మాస్కులు ధరించలేదని అధికారులు గుర్తించారు.బార్ కౌంటర్ దగ్గర పరిమితికి మించి జనం గుమిగూడారని నిర్ధారణకు వచ్చారు. నిజానికి సోషల్ మీడియాలో అక్కడి జగన్ గుమికూడి ఉన్న ఒక వీడియో వైరల్ అయింది.

రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి ఈ వీడియో చేరింది. ఆ వీడియో ప్రకారం కస్టమర్లు, సిబ్బందిని ప్రమాదంలోకి నెట్టే విధంగా యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని స్పష్టం కావడంతో ఎక్సయిజ్ శాఖకు పంపి దర్యాప్తునకు ఆదేశించారు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి. ఎక్సయిజ్ శాఖ దర్యాప్తు చేసి తెలంగాణా ఎక్సయిజ్ చట్టం సెక్షన్ 31 (1), 41, ఏపీ ఎక్సయిజ్ రూల్స్ 2005 లోని రూల్ 33, 38 ప్రకారం బార్ యాజమాన్యంపై కేస్ నెంబర్ 36/2020 నమోదు చేసింది. ఎవరైనా కరోనా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలకు వెనకాడబోమని అధికారులు చెబుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడితే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు.