Begin typing your search above and press return to search.
ఫత్వాః ముస్లింలు రొయ్యలు తినొద్దు
By: Tupaki Desk | 6 Jan 2018 5:04 PM GMTహైదరాబాద్ నగరానికి చెందిన ఇస్లామిక్ సెమినరి జమై నిజామియా సంస్థ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ముస్లింలు రొయ్యలు తినొద్దని ఫత్వా జారీ అయ్యింది. రొయ్య అనేది చేప జాతికి చెందినది కాదని ఈ సంస్థ తెలిపింది. ముస్లీంలు తినకూడని పదార్థాల్లో రొయ్య కూడా ఒకటని వెల్లడించింది. ఈ ఫత్వా సోషల్ మీడియలో వైరల్‌గా మారింది.
రొయ్యలు చేపల జాతికి చెందినవి కావని పేర్కొంటూ ముస్లిం మత పెద్దలు ఈ ఫత్వా జారీచేశారు. 142 ఏళ్ల ఇస్లామిక్ యూనివర్శిటీ జామియా నిజామియా సంస్థకు చెందిన గురువు ముఫ్తీ మహ్మద్ అజీముద్దీన్ జనవరి 1న ఈ ఫత్వా జారీ చేశారు. రొయ్యలు కీటకాల జాతికి చెందినవి పేర్కొంటూ అందుకే వాటిని తినకూడదంటూ నిషేధం విధించడమే కాకుండా ఫత్వా కూడా జారీ చేశారు. అయితే ఈ నిర్ణయం పట్ల ముస్లిం వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరికొందరు ముస్లిం పండితులు కూడా జామియా తీసుకున్న నిర్ణయం పట్ల నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలాఉండగా....బ్యాంకు ఉద్యోగం చేస్తున్న కుటుంబాలకు చెందిన (యువతీ - యువకుల) వారిని పెండ్లి చేసుకోవద్దని ఉత్తరప్రదేశ్ లక్నోలోని దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ ఇస్లామిక్ సంస్థ రెండు రోజుల క్రితం ఫత్వా జారీ చేసిన సంగతి తెలిసిందే. బ్యాంకు ఉద్యోగాలు చేస్తున్నవారు అక్రమార్జనకు పాల్పడుతున్నారని, అలాంటి వారిని దూరంగా పెట్టాలని పేర్కొన్నది. అందుకు బదులుగా గౌరవప్రదమైన కుటుంబాలకు చెందినవారిని పెళ్లి చేసుకోవాలని సూచించింది. `తండ్రి బ్యాంకు ఉద్యోగం చేస్తున్న కుటుంబాల నుంచి కొన్ని పెళ్లి ప్రతిపాదనలు వస్తున్నాయి. సహజంగానే ఆ ఇండ్లలోని వారు అక్రమార్జనతో పెరుగుతారు. ఇలాంటి కుటుంబాల నుంచి పెండ్లి చేసుకొనేందుకు ప్రాధాన్యం ఇవ్వొచ్చా?` అని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు దారుల్ ఉలూమ్ స్పందించింది. అలాంటి కుటుంబాలకు చెందిన వారిని పెళ్లి చేసుకోవద్దంటూ ఫత్వా జారీచేసింది. `అలాంటి కుటుంబాలకు చెందిన వారిని పెళ్లి చేసుకోకపోవడం మంచిది. ఎవరైతే అక్రమార్జనతో పెరుగుతారో.. వారు అమర్యాదగా ప్రవర్తిస్తారు. నైతిక విలువలను కలిగి ఉండరు. అందుకే ఇలాంటివారిని దూరంగా ఉంచాలి. గౌరవప్రదమైన కుటుంబాలకు చెందిన వారిని పెళ్లి చేసుకోవాలి` అని ఫత్వాలో పేర్కొన్నారు. డబ్బును వడ్డీకి ఇవ్వడాన్ని కూడా ఇస్లామిక్ చట్టం వ్యతిరేకిస్తున్నది. ఇస్లామిక్ బ్యాంకులు వడ్డీ లేని బ్యాంకింగ్ విధానాన్ని అమలుచేస్తాయి.
కాగా...వివిధ డిజైన్లు - శరీరానికి అతుక్కుని ఉండే బుర్ఖాలకు వ్యతిరేకంగా దారుల్ ఉలూమ్ దేవ్ బంద్ ఇస్లామిక్ సంస్థ ఫత్వా జారీచేసింది. డిజైన్ బుర్ఖాలు ధరించడం ఇస్లాం చట్టానికి వ్యతిరేకమని, ఇలాంటివి చెడును ఆకర్షిస్తాయని పేర్కొన్నది. వివిధ డిజైన్లు - రంగుల్లో ఉన్న బుర్ఖాలు ధరించడాన్ని ఇస్లాం అనుమతించదని.. ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఫత్వా జారీచేసింది.