Begin typing your search above and press return to search.
సంచలనం కోసమే హైదరాబాద్ స్విగ్గీ డెలివరీ బాయ్ కు కరోనా ఏపిసోడా?
By: Tupaki Desk | 20 April 2020 5:00 AM GMTదేశ రాజధానిలో ఫుడ్ డెలివరీ బాయ్ కు పాజిటివ్ రావటం.. అతగాడి పుణ్యమా అని పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదు కావటం తెలిసిందే. ఈ ఉదంతాన్ని తెలుసుకున్న వారంతా ఉలిక్కిపడ్డారు. ఇదే సమయంలో హైదరాబాద్ కు చెందిన స్విగ్గీ డెలివరీ బాయ్ కు పాజిటివ్ వచ్చిందన్న వార్త ఒకటి వైరల్ గా మారింది. ఈ ఎపిసోడ్ లో అసలు నిజం ఒకటైతే.. ప్రచారానికి వచ్చింది మరొకటి కావటం గమనార్హం.
తెలంగాణ ప్రభుత్వాన్ని.. పోలీసుల్ని ఉరుకులు పరుగులు పెట్టించిన ఈ వైనం లోకి వెళితే..షాకింగ్ విషయాలు బయటకు వస్తాయి. అసలు ఇలాంటి సంచలనాల వెనుక అసలు విషయం తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే. కొందరి నిర్లక్ష్యం.. లోపించిన జవాబుదారీతనంతో పాటు.. సంచలనాన్ని క్రియేట్ చేయాలన్న తపన.. రేటింగ్ ల కోసం పడే ఆరాటం.. కోట్లాది మంది ప్రజల్లో అనవసరమైన ఆందోళనకు గురి చేస్తుందన్న చేదు నిజం బయటకు వస్తుంది.
హైదరాబాద్ కు చెందిన స్విగ్గీ డెలివరీ బాయ్ కు కరోనా పాజిటివ్ గా తేలినట్లు ఒక వార్త వచ్చింది. ఈ వార్తలో నిజం ఎంత ఉందో.. అబద్ధాలు కూడా అంతగానే ప్రచారమయ్యాయి. ఈ విషయంలో అసలేం జరిగిందన్న విషయాన్ని తెలుసుకునేందుకు తుపాకీ పలువురు అధికారులతో మాట్లాడింది. క్షేత్రస్థాయిలో ఏం జరిగిందన్నది తెలుసుకునే ప్రయత్నం చేసింది. అందులో భాగంగా పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.
నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక వ్యక్తి కుటుంబం నివాసం ఉంటుంది. ఇంటికి యజమాని అయిన వ్యక్తి ఢిల్లీకి తబ్లిగీ జమాత్ సమావేశానికి హాజరై మార్చి 19 రాత్రి వేళకు హైదరాబాద్ కు వచ్చాడు. ఆ వ్యక్తి ఇంట్లో తల్లి.. తమ్ముడు.. భార్య.. పిల్లలు ఉంటారు. తమ్ముడు స్విగ్గీ డెలివరీ బాయ్ గా పని చేస్తుంటాడు. అన్న మర్కజ్ కు వెళ్లి వచ్చిన తర్వాత రెండు రోజులు (మార్చి 20, 21) తేదీల్లో స్విగ్గీ డెలివరీలో ఇచ్చాడు. అది కూడా పరిమిత సంఖ్యలో మాత్రమే. అధికారుల సమాచారం ప్రకారం పది కంటే తక్కువ డెలివరీలే అతను చేశాడు.
22న జనతా కర్ఫ్యూ కావటం.. వెంటనే లాక్ డౌన్ ను తెలంగాణ లో అమల్లోకి రావటంతో బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. ఇదిలా ఉంటే.. మర్కజ్ సమాచారం పోలీసులకు వెళ్లటం.. తెలంగాణ నుంచి వెళ్లిన వారి వివరాల్ని సేకరించిన పోలీసులు.. స్విగ్గీ డెలివరీ బాయ్ కుటుంబాన్ని కూడా గుర్తించారు. వారిని ఇంటి నుంచి బయటకు రాకూడదని.. ఆరోగ్యం ఏ మాత్రం తేడాగా ఉన్నా తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు.
మార్చి 29.. 30 తేదీల్లో స్విగ్గీ డెలివరీ బాయ్ అన్న (మర్కజ్ కు వెళ్లి వచ్చిన వ్యక్తికి)కు జ్వరం.. దగ్గుతో కూడిన కరోనా లక్షణాలు బయటకు రావటంతో వారు సమాచారాన్ని అధికారులకు అందించారు. వారు అతన్ని ఆసుపత్రికి తరలించి పరీక్షలు జరపగా.. ఏప్రిల్ ఐదున పాజిటివ్ గా తేలింది. దీంతో.. మరింత అలెర్టు అయిన అధికారులు.. ఆ కుటుంబం మొత్తానికి పరీక్షలు నిర్వహించారు. పిల్లలకుమినహాయించి మిగిలిన కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ అన్నది ఏప్రిల్ ఎనిమిదిన తేలింది. దీంతో వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ విషయాలు ఆలస్యంగా.. కొత్త మసాలాతో బయటకు వచ్చాయి. ఏప్రిల్ 18న కొందరు అత్యుత్సాహంతో స్విగ్గీ డెలివరీ బాయ్ కు కరోనా పాజిటివ్ అంటూ.. అప్పుడే వెలుగు చూసినట్లుగా వార్తలు వండేశారు. బ్రేకింగ్ న్యూస్ అంటూ వేసేశారు. పనిలో పనిగా.. సదరు డెలివరీ బాయ్ ఎన్ని ఆర్డర్లు డెలివరీ చేశారో? అతనుఎంతమందిని కాంటాక్టు చేశాడో? అన్న సందేహాలతో పాటు.. ఆందోళనను వ్యక్తం చేశారు. ఇలాంటి వార్తల్ని లోతుగా పరిశీలించి.. వెంటనే కట్టడి చేయాల్సిన అధికారులు అందుకు భిన్నంగా ఇదో కొత్త కేసుగా భావించి.. డెలివరీ బాయ్ చేసిన డెలివరీలు ఎన్ని అన్న అంశానికే ప్రాధాన్యత ఇచ్చారని తెలిసిందే.
అయితే.. ఉన్నతాధికారుల జోక్యం.. అసలేం జరిగిందన్న విషయాన్ని లోతుగా చర్చ జరిపిన నేపథ్యంలో.. అసలు విషయాలు బయటకు వచ్చాయి. స్విగ్గీ డెలివరీ బాయ్ ఆఖరుగా డెలివరీ చేసింది చూసినా మార్చి 21. అలా చూసుకున్నా.. ఈ వార్త బయటకు వచ్చే నాటికి దగ్గర దగ్గర నాలుగు వారాల వరకూ సమయం పట్టిన పరిస్థితి. ఒకవేళ పాజిటివ్ కేసులు నమోదు అయితే.. ఇప్పటికే వచ్చేసి ఉండాలి. కానీ.. అలాంటిదేమీ జరగలేదు అన్నింటికి మించి ఏప్రిల్ 8న పాజిటివ్ గా తేలిన ఉదంతాన్ని ఏప్రిల్ 18న పాజిటివ్ కేసు బయటకు వచ్చినట్లుగా హడావుడి చేయటంలో అర్థం లేదని చెప్పాలి. ఇలాంటి అంశాలకు సంబంధించిన సమాచారాన్ని వివరంగా బయటకు వెల్లడించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రజలు ఏ విషయాలకు ఎక్కువ ఆందోళన చెందుతారో.. అలాంటి వాటిపై సాగే దుష్ప్రచారాలకు చెక్ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పక తప్పదు.