Begin typing your search above and press return to search.
హైదరాబాద్ టు చికాగో.. డైరెక్ట్ విమానం
By: Tupaki Desk | 15 Jan 2021 7:09 AM GMTఇన్నాళ్లు అమెరికా వెళ్లాలంటే తప్పనిసరిగా తెలుగు రాష్ట్రాల ప్రజలు.. దేశంలోని కొన్ని రాష్ట్రాల వారు ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి అమెరికా వెళ్లాల్సి వచ్చేది. ముంబై, బెంగళూరు నుంచి ఒకటి అరా సర్వీసులున్నాయి. అయితే ఇక నుంచి ప్రయాణికుల ఇబ్బందులు తీరనున్నాయి. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి అమెరికాకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.
జాతీయ విమానయాన సంస్థ ఎయిరిండియా అమెరికాకు నేరుగా విమాన సర్వీసులు తీసుకొచ్చింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 777-200 ఎల్ఆర్ విమానంలో మధ్యాలో హాల్ స్టాప్ లేకుండా నేరుగా చికాగోకు వెళ్లొచ్చు. ఈ మేరకు గురువారం ఎయిర్ ఇండియా కీలక ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్ , చికాగో మధ్య డైరెక్టు విమానం కోసం చాలా కాలంగా డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎయిరిండియా విమానం సమకూర్చారు. ప్రతి బుధవారం చికాగో నుంచి రాత్రి 9.30 గంటలకు ఏఐ108 విమానం హైదరాబాద్ కు బయలుదేరుతుంది. శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు హైదరాబాద్ నుంచి చికాగోకు వెళుతుంది. వారానికి ఒకసారి మాత్రమే ఈ సర్వీసు ఉంటుంది.
హైదరాబాద్ నుంచి చికాగో చేరుకునేందుకు 16 గంటల 45 నిమిషాలు పడితే.. చికాగో నుంచి హైదరాబాద్ కు 15 గంటల 40 నిమిషాలు పట్టనుంది.
వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ www.airinida.in లేదా టోల్ ఫ్రీ నంబర్ 18602331407కు కాల్ చేయాలని ఎయిర్ ఇండియా కోరింది. మొత్తం 238 సీట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. జనవరి 13న తొలి విమాన సర్వీసు చికాగో నుంచి బయలుదేరిందని ఎయిర్ ఇండియా వెల్లడించింది.