Begin typing your search above and press return to search.
మునుగోడు తీర్పు తేల్చేయనున్న హైదరాబాదీయులు
By: Tupaki Desk | 19 Oct 2022 4:16 AM GMTయావత్ తెలంగాణ ఇప్పుడు మునుగోడు ఉప పోరు గురించి ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు. ఉప పోరు ఫలితం ఎలా ఉంటుందన్న ఉత్కంట రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నెలకొంది. పోటాపోటీగా.. ఇటీవల కాలంలో మరే ఉప పోరులోనూ కనిపించనంత పోరు ఈ ఎన్నికలో కనిపిస్తుందని చెప్పాలి. మూడు ప్రధాన పార్టీల మధ్య జరుగుతున్న ఈ ముక్కోణ పోటీలో విజేతగా ఎవరు నిలిచినా.. రాజకీయ సమీకరణాల్లో మాత్రం మార్పు ఖాయమని చెప్పక తప్పదు. దేశంలోనే అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా అభివర్ణిస్తున్న మునుగోడు ఉప పోరుకు సంబంధించిన ఒక కీలక అంశం సరికొత్తగా తెర మీదకు వచ్చింది.
హైదరాబాద్ కు దూరన ఉండే మునుగోడు అసెంబ్లీ ఎన్నిక ఫలితాన్ని హైదరాబాద్ మహానగరం తేల్చనుందన్న మాట ఆసక్తికరంగా మారింది. అదెలా అంటే.. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని 25 వేల మంది ఓటర్లు హైదరాబాద్ లోనే ఉండటం దీనికి కారణం. ఉపాధి అవకాశాలతో పాటు.. ఉద్యోగాలు చేసేందుకు వీలుగా భారీ ఎత్తున ఓటర్లు హైదరాబాద్ మహానగరంలోనే ఉన్నట్లుగా చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం హైదరాబాద్ లో మునుగోడు ఓటర్లు ఏకంగా 25 వేల మంది ఉంటే.. ఒక్క ఎల్ బీనగర్ నియోజకవర్గ పరిధిలోనే 25 వేల మంది ఉన్నట్లు తెలుస్తోంది.
ఇంత భారీగా ఉన్న ఓటర్లను ఆకట్టుకోవటానికి అధికార టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న విధానాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి 200లకు పైనే ఓటర్లు ఉన్నట్లుగా గులాబీ దళం లెక్క వేసినట్లుగా చెబుతున్నారు. ఇక.. హైదరాబాద్ లోని 16 కంపెనీల్లో మునుగోడు వాసులు అత్యధికంగా ఉన్నట్లు గుర్తించారు.
దీంతో.. హైదరాబాద్ లోని మునుగోడు ఓట్లను కొల్లగొట్టేందుకు అధికార టీఆర్ఎస్ పక్కా బ్లూ ప్రింట్ ను సిద్ధం చేసింది. మునుగోడు ఓటర్లను ఏయే కంపెనీల్లో ఉన్నారన్న విషయాన్ని గతంలోనే జల్లెడ పట్టటమే కాదు.. వారి వివరాల్ని పూర్తిగా నిక్షిప్తం చేశారు. ఏయే కంపెనీల్లో ఎంత మంది ఉన్నారు? సదరు కంపెనీల్లో మునుగోడు ఓటర్లు ఏయే విభాగాల్లో ఎంత మంది చొప్పున ఉన్నారన్న విషయాన్ని లెక్కలు తీసి.. వారి మనసు దోచుకునేలా ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది.
మునుగోడు ఫలితాన్ని ప్రభావితం చేసే సత్తా హైదరాబాద్ ఓటర్లకు ఉన్న నేపథ్యంలో.. వారిని చేజార్చుకోకూడదన్న పట్టుదలతో అధికార పార్టీ ఉంది. అందుకే.. నగరానికి చెందిన కొందరు ఎమ్మెల్యేలకు ఈ బాధ్యతను అప్పజెప్పారని చెబుతున్నారు. అంతేకాదు..ఎట్టి పరిస్థితుల్లోనూ వారి ఓట్లు చేజార్చకూడదన్న ఫర్మానా జారీ అయినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారాన్ని సమీక్షించేందుకు వీలుగా.. నగరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలను సిటీలోనే ఉంచేయటం.. పార్టీ పరంగా ఎలాంటి సహాయ సహకారాలు అవసరమైనా వాడుకోవాలని స్పష్టం చేసినట్లుగా సమాచారం.
మహానగరంలో మునుగోడు ఓటర్లు భారీగా ఉండటంతో.. వారిలో అత్యధికులు కారు గుర్తుకే ఓటుల వేసేందుకు వీలుగా ప్రణాళికను సిద్ధం చేయటమే కాదు.. ఎలాంటి తప్పులు దొర్లకుండా ఉండేందుకు వీలుగా మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించినట్లుగా చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.