Begin typing your search above and press return to search.
హైదరాబాద్ టు నిజామాబాద్ జర్నీకి 9 లక్షలు
By: Tupaki Desk | 3 Sep 2016 9:35 AM GMTఏదైనా పనిమీద ఒక చోట నుంచి మరో చోటకి వెళ్లాల్సి వస్తే.. సాధారణంగా టాక్సీలను బుక్ చేసుకోవడం సర్వసాధరణం. ఇక, ఇప్పుడు టాక్సీల ప్రపంచంలో ఓలా క్యాబ్ సంచలనం. మనం ఆన్ లైన్ లో బుక్ చేసిన క్షణాల్లోనే సిబ్బంది స్పందించడం తోపాటు కేవలం అరగంట వ్యవధిలోనే మన ఇంటి ముందుకి క్యాబ్ వచ్చి చేరుతోంది. దీంతో ఇటీవల కాలంలో హైదరాబాద్ - ముంబై సహా దేశ వ్యాప్తంగా ఓలా క్యాబ్‌కి డిమాండ్ పెరిగింది. ఈ క్యాబ్ అందించే సర్వీసుకి కూడా మంచి పేరుంది. దీంతో ప్రభుత్వ అధికారులు సహా అందరూ ఓలాకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే, ఇటీవల హైదరాబాద్ లో జరిగిన ఓ ఘటన ఓలా పాసింజర్ కి షాకిచ్చేలా చేసింది. ప్రయాణించిన దూరాన్ని బట్టి రావాల్సిన బిల్లు.. ప్రపంచాన్ని చుట్టొస్తే ఎంత వస్తుందో అంత వచ్చిందట! దీంతో ఆ ప్రయాణికుడు లబోదిబోమన్నాడు.
రతీష్ శేఖర్ ప్రభుత్వ పనులపై ప్రైవేట్ కన్సల్టెంట్ గా హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు. ఆగస్టు 24న హైదరాబాద్ నుంచి నిజమాబాద్ కి ఓలో క్యాబ్ లో వెళ్లాడు. అదే రోజు సాయంత్రానికి హైదరాబాద్ చేరుకున్నాడు. తీరా బిల్లు కట్టేందుకు క్యాబ్ మీటర్ చూడగా.. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. మీటర్ రీడింగ్ రూ.9.15(9,15,887)లక్షల బిల్లు చూపించింది. దీంతో రతీష్ శేఖర్ తో పాటు క్యాబ్ డ్రైవర్ సునీల్ కుమార్ షాక్ తిన్నారు. అసలు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్లి రావడానికి ఎంత బిల్లు అవుతుందో చూడగా.. వాస్తవానికి ఐదు వేలు దాటలేదు. కానీ, ఇప్పుడు బిల్లు లక్షల్లో వచ్చే సరికి అంత బిల్లు కట్టేదిలేదని, ఈ సొమ్ముతో రెండు కార్లు కొనుక్కోవచ్చని రతీష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
తీరా కంపెనీ వాళ్లు లైన్లోకి వచ్చి.. వాస్తవ దూరం లెక్కగట్టి.. 4,812 రూపాయలు చెల్లించాలని సూచించారు. దీంతో రతీష్ ఆ సొమ్ము చెల్లించాడు. అయితే, ఇక్కడ విషయం ఏంటంటే.. మీటర్ మోసం చేసిందా లేక ఏదైనా సాంకేతిక తప్పిదం దొర్లిందా అనేది. ఇటీవల కాలంలో మనకు కరెంటు బిల్లులు కూడా ఇదే తరహాలో వస్తుండడం గమనిస్తూనే ఉన్నాం. ఒక బల్బు - ఒకఫ్యాను ఉన్న ఇంటికి రూ.లక్షకు పైగా బిల్లు వచ్చిన పరిస్థితి ఉంది. అయితే, ఇప్పుడు ఈ పరిస్థితి క్యాబ్ కి రావడం ఆసక్తిగా మారింది. అయితే, కేవలం చిన్న డిస్మల్ ప్రాబ్లం కారణంగా ఇలా జరిగిందని క్యాబ్ డ్రైవర్ చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది.