Begin typing your search above and press return to search.
తాజా డ్రంకెన్ డ్రైవ్ లో భారిగా దొరికిన అమ్మాయిలు
By: Tupaki Desk | 25 March 2018 5:02 AM GMTతాగి వాహనం నడిపితే.. నడిపిన వారి ప్రాణాలకే కాదు.. వారి కారణంగా ఎదుటి వాహనాలకు కూడా ప్రమాదమే. చాలా సింఫుల్ అయిన ఈ విషయంపై హైదరాబాద్ మహానగర ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోలీసు శాఖ చేస్తున్న ప్రయత్నాలు అన్నిఇన్ని కాదు.
డ్రంకెన్ డ్రైవ్ ను ప్రతి వీకెండ్ రెగ్యులర్ గా నిర్వహిస్తూ తనిఖీలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా పట్టుబడిన వారికి.. వారు చేసిన తప్పుకు తగ్గట్లు శిక్షలు విధిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖులు పట్టుబడినా పోలీసులు వెనక్కి తగ్గటం లేదు. వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
తాము నిర్వహిస్తున్న డ్రంకెన్ డ్రైవ్ కేవలం ప్రమాదాల్ని నిరోధించటానికి.. ప్రాణాలు కాపాడటానికే కానీ ప్రచారం కోసం కాదన్న మాటను పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. డ్రంకెన్ డ్రైవ్ కారణంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగి.. చాలామంది మరణించినా నగరజీవులకు మాత్రం ఆ విషయం ఎక్కటం లేదు.
పూటుగా తాగేయటం.. వాహనాన్ని నడిపేయటం ఇప్పుడో చెడ్డ లక్షణంగా మారింది. గతంలో డ్రంకెన్ డ్రైవ్ లో పురుషులు మాత్రమే దొరికేవారు. అప్పుడప్పడు మహిళలు తనిఖీల్లో చిక్కినా అది తక్కువగా ఉండేది. ఒకరిద్దరు కూడా ఉండేవారు కాదు. తాజాగా నిన్న రాత్రి (శనివారం) జూబ్లీహిల్స్ లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ లో మొత్తం ఆరుగురు మహిళలు పట్టుబడటం గమనార్హం.
తాగి వాహనం నడిపిన 76 మందిని పోలీసులు గుర్తించారు. వీరిపై కేసులు నమోదు చేశారు. వీరు నడుపుతున్న వాహనాల్ని సీజ్ చేశారు. అయితే.. ఈసారి రికార్డు స్థాయిలో ఆరుగురు అమ్మాయిలు దొరికిపోవటం సంచలనంగా మారింది. వీరిపై కూడా కేసులు బుక్ చేశారు. తాగి నడిపిన వారు తప్పనిసరిగా ట్రాఫిక్ పోలీసులు నిర్వహించే కౌన్సెలింగ్ కు తల్లిదండ్రులతో పాటు హాజరు కావాల్సి ఉంటుంది. సో.. ఈసారి కౌన్సెలింగ్ కు ఎక్కువ మంది అమ్మాయిలు కూడా రానున్నారన్న మాట. తాజా డ్రైవ్ లో మొత్తం 76 మంది పట్టుబడగా.. అందులో కార్లు 40 ఉండగా.. 36 బైకులు ఉన్నాయి. ఈ వాహనాల్ని పోలీసులు సీజ్ చేశారు.