Begin typing your search above and press return to search.
తెలంగాణలో ఒక్కరోజులోనే సీజ్ చేసిన వాహనాలు ఎన్నో తెలుసా?
By: Tupaki Desk | 23 April 2020 5:45 AM GMTఎంత చెప్పినా వినకుండా తమ తీరు మార్చుకోకుండా అదే పనిగా రోడ్ల మీదకు వచ్చే వారి విషయంలో ఊహించని షాకిచ్చారు తెలంగాణ పోలీసులు. లాక్ డౌన్ నిబంధనల్ని బ్రేక్ చేసే వారికి ఎన్ని తిప్పలన్న విషయాన్ని ఒక్కరోజులోనే చాలామందికి తెలిసేలా చేశారు. ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా.. లాక్ డౌన్ వేళ.. అదే పనిగా రోడ్ల మీదకు వస్తున్న ఉల్లంఘనులకు షాకిచ్చే డ్రైవ్ ఒకటి తెలంగాణ పోలీసులు నిర్వహించారు.
ఇందులో భాగంగా రోడ్ల మీదకు సరైన కారణం లేకుండా వస్తున్న వారికి.. నిబంధనలకు భిన్నంగా రోడ్ల మీదకు వచ్చిన ప్రతి వాహనాన్ని చెక్ చేశారు. ఈ సందర్భంగా రూల్స్ ను బ్రేక్ చేసినట్లుగా గుర్తించి 1.25లక్షల వాహనాల్ని సీజ్ చేశారు. ఎంతో అవసరమైతే తప్పించి రోడ్ల మీదకు రాకూడదని.. అలా వచ్చే వారికి ఇలాంటి షాకులు తప్పవని పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
కరోనా కేసుల్ని కంట్రోల్ చేసే క్రమంలో రోడ్ల మీదకు అదే పనిగా ప్రజలు రాకూడదని.. తాము తాజాగా తీసుకొచ్చిన నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని కోరుతున్నారు తెలంగాణ పోలీసులు. రూల్స్ ను బ్రేక్ చేసే వారి వాహనాల్ని సీజ్ చేస్తే.. లాక్ డౌన్ తర్వాత కోర్టు ద్వారా తప్పించి విడిగా వాహనంగా వచ్చే అవకాశం ఉండదు.
ఈ విషయాన్ని గుర్తించి.. అదే పనిగా రోడ్ల మీదకు వచ్చే వారు తిప్పలు కొని తెచ్చుకోకూడదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ.. ఏదైనా సరైన కారణంతో బయటకువస్తే మాత్రం.. అందుకు తగ్గ పత్రాలు తమ వెంట తెచ్చుకోవాలంటున్నారు. ఏమైనా.. తెలంగాణ వ్యాప్తంగా ఒక రోజు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో ఇంత భారీగా వాహనాలు పట్టుబడటం షాకింగ్ గా మారింది.ఏమైనా లాక్ డౌన్ నిబంధనల్ని పక్కాగా అమలు చేయటంలో తెలంగాణ పోలీసులు తమ మార్కును చూపిస్తున్నారని చెప్పక తప్పదు.