Begin typing your search above and press return to search.
రోహిత్ కుటంబానికి రూ.8 లక్షలు
By: Tupaki Desk | 22 Jan 2016 6:34 PM GMTహెచ్‌సీయూలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ కుటుంబానికి ఆ యూనివర్శిటీ నష్టపరిహారాన్ని ప్రకటించింది. విద్యార్థి కుటుంబానికి రూ.8లక్షలను అందజేయనున్నట్లు యూనివర్శిటీ అధికారికంగా తెలిపింది. ఈ మేరకు త్వరలో నిధులు విడుదల చేయనున్నట్లు వివరించింది. కాగా, విద్యార్థి మృతి పట్ల గత మూడు రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థులు రోహిత్ కుటుంబ సభ్యులకు యూనివర్శిటీ రూ.50 లక్షల నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు గుంటూరు వాస్త్రవ్యుడు అయిన రోహిత్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం ముందుకువచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం రోహిత్ తల్లి విద్యార్హతలు అధ్యయనం చేస్తున్నారు. ఆమె అర్హతలకు తగిన ఉద్యోగం ఇచ్చేలా కసరత్తు సాగుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే చంద్రబాబు సారథ్యంలోని తెలుగుదేశం పార్టీ తరఫున రూ.5లక్షల సహాయం అందజేస్తామని ప్రకటించారు. ఏపీ మంత్రి రావెల కిశోర్‌బాబు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు, తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆమె తల్లిని సందర్శించి పరామర్శించారు. ఈ సందర్భంగా సహాయం హామీ ఇచ్చారు.